ETV Bharat / business

రెన్యువల్‌ ప్రీమియంపై 80-100% రాయితీ! - ఆరోగ్య బీమా ప్రోత్సాహకాలు

పాలసీ పునరుద్ధరణ ప్రీమియంపై 100 శాతం వరకు రాయితీ ఇచ్చేలా సరికొత్త పథకాలతో ముందుకొస్తున్నాయి ప్రైవేటు బీమా సంస్థలు. ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించే వినియోగదారులకు పాలసీల పునరుద్ధరణలో వీటిని ఇవ్వనున్నాయి. మందుల కొనుగోళ్లు, రోగ నిర్ధరణ పరీక్షలు, ఓపీ ఖర్చులు, ప్రత్యామ్నాయ చికిత్సలకు లేదా భవిష్యత్తు ప్రీమియం చెల్లింపునకు వీటిని వినియోగించుకునే వీలు కల్పిస్తున్నాయి.

Private health insurers latest offers
ప్రైవేట్​ బీమా సంస్థల కొత్త పథకాలు
author img

By

Published : Mar 1, 2021, 9:51 AM IST

ఆరోగ్యవంత జీవనశైలి గడిపే వినియోగదారులకు పాలసీల పునరుద్ధరణ (రెన్యువల్‌) ప్రీమియంపై 80-100 శాతం ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రైవేటు ఆరోగ్య బీమా సంస్థలు సిద్ధమవుతున్నాయి. బహుమతులు, ఇతర ప్రయోజనాలను అందిస్తున్నాయి.

సాధారణంగా ఆరోగ్య బీమా సంస్థలు క్లెయిమ్‌ చేయని సంవత్సరాలకు నో-క్లెయిమ్‌ బోనస్‌ కింద 25-50 శాతం మధ్య ఇస్తుంటాయి. అయితే ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఇటీవల వినూత్న ఆరోగ్య బీమా పథకాన్ని ఆవిష్కరించింది. ఏడాది కాలంలో తగినన్ని రోజుల పాటు రోజూ 10,000 అడుగుల చొప్పున నడిచినా, లేదా తాము సూచించిన వ్యాయామం రోజూ 30 నిముషాల పాటు చేసినా, 6 నెలలకోసారి ఫిట్‌నెస్‌ పరీక్ష చేయించుకున్నా, మరుసటి ఏడాది పాలసీ పునరుద్ధరణ ప్రీమియంపై 100 శాతం వరకు హెల్త్‌ రిటర్న్‌లు ఇచ్చేందుకు సిద్ధమైంది.

మందుల కొనుగోళ్లు, రోగ నిర్థారణ పరీక్షలు, ఓపీ ఖర్చులు, ప్రత్యామ్నాయ చికిత్సలకు లేదా భవిష్యత్తు ప్రీమియం చెల్లింపునకు వీటిని వినియోగించుకోవచ్చు. పాలసీదారు జీవనశైలిని యాక్టివ్‌ హెల్త్‌ యాప్‌ ద్వారా పరిశీలిస్తుంటుంది. ఈ పాలసీ కొనుగోలు చేసిన వ్యక్తి ఏడాదికి చెల్లించిన ప్రీమియం మొత్తంలో 50 శాతం చొప్పున నో-క్లెయిమ్‌ బోనస్‌ కింద వెనక్కి వస్తుంది. రెండేళ్లపాటు క్లెయిమ్‌ లేకపోతే బీమా పాలసీ ప్రీమియం మొత్తాన్ని వెనక్కి తిరిగి ఇచ్చే సరికొత్త పాలసీ ఇది. మరో సంస్థ ఫ్యూచర్‌ జనరాలీ ఇండియా కూడా 80 శాతం రాయితీతో సరికొత్త పాలసీ ప్రారంభించింది.

ఇదీ చదవండి:బీమాతోనే ధీమా- ఆర్థిక భద్రతకే ప్రాధాన్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.