ETV Bharat / business

జీవనకాల గరిష్ఠానికి విద్యుత్​ డిమాండ్​ - విద్యుత్​ డిమాండ్​ భారీగా పెరిగింది

దేశీయ విద్యుత్​ డిమాండ్ శనివారం జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. మొత్తం డిమాండ్ 189.64 గిగావాట్ల స్థాయిని తాకినట్లు కేంద్ర విద్యుత్​ శాఖ కార్యదర్శి ప్రకటించారు.

Power demand touches all-time high of 189.64 GW on Saturday
జీవనకాల గరిష్ఠానికి విద్యుత్​ డిమాండ్​
author img

By

Published : Jan 31, 2021, 4:48 PM IST

దేశంలో విద్యుత్​ డిమాండ్ శనివారం సరికొత్త రికార్డును నమోదు చేసింది. తొలిసారి 189.64 గిగావాట్ల డిమాండ్​ నమోదైనట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఇంతకు ముందు ఇదే నెల 28న.. 1,88,452 మెగావాట్లుగా విద్యుత్​ డిమాండ్​ నమోదైనట్లు తెలిపింది. తాజాగా ఇది 1,89,644 మెగావాట్ల మార్క్​ను (ఉదయం 10:39 ) తాకినట్లు కేంద్ర విద్యుత్​ శాఖ కార్యదర్శి ఎస్​ఎన్​ సహాయ్​ ట్వీట్​ చేశారు.

అయితే త్వరలోనే డిమాండ్​ స్థాయి 200 గిగావాట్లకు చేరుకుంటుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్​కే సింగ్ పేర్కొన్నారు.

గత జనవరిలో గరిష్ఠ విద్యుత్​ డిమాండ్​ 170.97 గిగావాట్లుగా ఉండేది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టి.. పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకున్నందున విద్యుత్​ వినియోగం భారీగా పెరిగినట్టు తెలుస్తోంది.

కొవిడ్​-19 వ్యాప్తితో విధించిన దేశవ్యాప్త లాక్​డౌన్​ కారణంగా ఏప్రిల్​ నుంచి ఆగస్టు వరకు విద్యుత్​ డిమాండ్పై తీవ్ర ప్రభావం ఏర్పడింది. అయితే.. సెప్టెంబర్​ నుంచి విద్యుత్​ డిమాండ్​ గణనీయంగా కోలుకుంది. అదే నెలలో 1.7శాతం, అక్టోబర్​లో 3.4 శాతం, నవంబర్​ 3.5 శాతం, డిసెంబర్​ 7.3 శాతం పెరిగింది.

ఇదీ చూడండి: దేశంలో జీవనకాల గరిష్ఠానికి విద్యుత్​ డిమాండ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.