ETV Bharat / business

వేలానికి 'మోదీ' పెయింటింగ్స్​, విలాసవంతమైన కార్లు - పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నేరస్థుడు నీరవ్​ మోదీ

పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకి చెందిన ఆస్తులు మరోసారి వేలానికి వచ్చాయి. నీరవ్​కు చెందిన అరుదైన పెయింటింగ్స్​, అత్యంత విలువైన చేతి గడియారాలు, విలాసవంతమైన కార్లు సహా 112 వస్తువులను గురువారం వేలం వేయనున్నారు. మార్చి 3, 4 తేదీల్లో నీరవ్​కు చెందిన మరో 72 వస్తువులకు ఆన్​లైన్​ వేలం నిర్వహించనున్నారు.

Nirav Modi's Rolls Royce Ghost, diamond watch, among 112 assets to go under hammer
మరోసారి వేలానికి నీరవ్ మోదీ ఆస్తులు
author img

By

Published : Feb 27, 2020, 5:25 AM IST

Updated : Mar 2, 2020, 5:15 PM IST

పంజాబ్​ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీ ఆస్తులు మరోసారి వేలానికి వచ్చాయి. ఇందులో అరుదైన పెయింటింగ్స్​, అత్యంత విలువైన చేతి గడియారాలు, విలాసవంతమైన కార్లు ఉన్నాయి.

ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో​ గురువారం ప్రత్యక్ష వేలం జరగనుంది. ఇందులో నీరవ్​ మోదీకి చెందిన 112 విలువైన (ఆస్తులు) వస్తువులను వేలం వేయనున్నారు. మార్చి 3, 4 తేదీల్లో నీరవ్​కు చెందిన ఇంకో 72 వస్తువులకు ఆన్​లైన్​ వేలం నిర్వహించనున్నారు.

ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ గతేడాది మార్చిలో నీరవ్​ మోదీకి చెందిన రూ.55 కోట్ల విలువైన కళాకృతులను వేలం వేసిన విషయం తెలిసిందే.

బాయ్స్​ విత్ లెమన్స్

1935లో అమృతా షేర్​ గిల్​ గీసిన 'బాయ్స్​ విత్​ లెమన్స్​' చిత్రం ఈ వేలం పాటలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, సుమారుగా రూ.12 కోట్ల నుంచి రూ.18 కోట్లు వరకు ధర పలుకుతుందని భావిస్తున్నారు.

1972లో ప్రఖ్యాత పెయింటర్​ ఎంఎఫ్ హుస్సేన్ గీసిన చిత్రం కూడా మంచి ధరను పొందవచ్చని ఆశిస్తున్నారు. వీటితో పాటు వీఎస్​ గైతోండే, మంజిత్ బావా, రాజా రవివర్మ చిత్రాలు కూడా వేలంలో ఉన్నాయి.

70 లక్షల చేతిగడియారం

రూ.70 లక్షల విలువ చేసే జేగర్​-లీకాల్టర్ మెన్స్​కు చెందిన లిమిటెడ్ ఎడిషన్ రిస్ట్​వాచ్​ వేలంలో ఉండనుంది. అలాగే పటేక్​ ఫిలిప్​ 'నాటిలస్' గోల్డ్, డైమండ్​ రిస్ట్​వాచ్​ వేలంలో రూ.70 లక్షల వరకు పలకవచ్చని భావిస్తున్నారు.​

రోల్స్ రాయిస్ ఘోస్ట్​

విలాసవంతమైన రోల్స్ రాయిస్​ ఘోస్ట్​కు గురువారం జరిగే వేలంలో రూ.95 లక్షల వరకు లభిస్తుందని ఆశిస్తున్నారు.

వేలంలో ఫ్రెంచ్ లగ్జరీ వస్తువుల తయారీదారు హెర్మెస్​కు చెందిన ఐకానిక్​ బిర్కిన్, కెల్లీ లైన్స్​తో సహా బ్రాండెడ్​ హ్యాండ్​ బ్యాగులున్నాయి. వీటికి సుమారు రూ.6 లక్షల వరకు లభించే అవకాశం ఉంది.

ఆన్​లైన్​ వేలంలో

మార్చి 3, 4 తేదీల్లో నీరవ్​కు చెందిన మరో 72 వస్తువులకు ఆన్​లైన్​ వేలం నిర్వహించనున్నారు. వీటిలో పోర్స్చే పనామెరా ఎస్ కారు కూడా ఉంది. వీటన్నింటికీ కలిపి సుమారు రూ.15 లక్షల వరకు లభిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

లండన్ జైలులో

రూ.14వేల కోట్ల మేర పంజాబ్​ నేషనల్​ బ్యాంకును మోసం చేసిన నీరవ్​ మోదీ​ ప్రస్తుతం బ్రిటన్​ జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు.

ఇదీ చూడండి: ట్రంప్ భారత పర్యటన శుష్క ప్రయత్నం: కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్

Last Updated : Mar 2, 2020, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.