కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వార్షికోత్సవం మంగళవారం జరగనుండగా ముఖ్య అతిథిగా హాజరకానున్నారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ కార్యక్రమంలో ఆర్థిక వ్యవస్థ పునుర్ధరణకు సంబంధించి 'గెట్టింగ్ గ్రోత్ బ్యాక్'(వృద్ధిని తిరిగి సాధించడం)అనే అంశంపై ప్రసంగించనున్నట్లు సమాచారం. కరోనా లాక్డౌన్ కారణంగా తాత్కాలికంగా మూతపడిన కంపెనీలు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో మోదీ ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది.
1895లో ప్రారంభమైన సీఐఐ ఈ ఏడాదికి 125 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా వార్షికోత్సవాన్ని నిర్వహిస్తోంది సంస్థ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజంతా ఈ వేడుకలు జరగనున్నాయి.
ఈ కార్యక్రమానికి పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్, ఐటీసీ లిమిటెడ్ సీఎండీ సంజీవ్ పూరి, బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్-షా, ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్, కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కోటక్, సీఐఐ అధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్ పాల్గొన్ననున్నారు.
దేశ జీడీపీ 5 శాతమే
లాక్డౌన్ కారణంగా జీడిపీ వృద్ధి తగ్గుముఖం పడనున్నట్లు ఆర్థికవేత్తలు, కొన్ని ప్రైవేట్ సంస్థలు అంచనా వేశాయి. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆర్థిక వ్యవస్థలో భారత వృద్ధి రేటు 5శాతంగా నమోదవుతుందని ఫిట్స్ రేటింగ్ సంస్థ అభిప్రాయపడింది. ఏప్రిల్ నెలలో కేవలం 0.8 శాతం నమోదైనట్లు తెలిపింది.
ఇదీ చూడండి:'కరోనాపై పోరులో 'బాహుబలి' ప్రధాని విఫలం'