ETV Bharat / business

కరోనా వేళ ఔషధ రంగం ఎగుమతులు భేష్​

కరోనా వైరస్‌ వ్యాధితో ప్రపంచ దేశాలన్నీ అల్లకల్లోలంగా ఉన్న ఏప్రిల్‌లో అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు, ఎగుమతులు బాగా కుంగిపోయాయి. అత్యవసరాలు తప్పించి, మిగిలిన వస్తువులకు కొనుగోలుదార్లు లేరు. ఆర్థిక ఇబ్బందులు, 'లాక్‌డౌన్‌' ఇందుకు ప్రధాన కారణాలు. కానీ ఔషధరంగం మాత్రం అందుకు మినహాయింపు.

EXPORTS IN APRIL
ఔషధ రంగం ఎగుమతులు భేష్​
author img

By

Published : May 26, 2020, 8:36 AM IST

మనదేశం నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో 1531.06 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.11,500 కోట్ల) విలువైన మందులు ఎగుమతి చేశాయి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో దీన్నొక రికార్డుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇంత సంక్షోభంలోనూ దేశీయ ఔషధ కంపెనీలు సత్తా చాటాయని ఫార్మాగ్జిల్‌ (ఫార్మాస్యూటికల్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఉదయ భాస్కర్‌ విశ్లేషించారు. 2019 ఏప్రిల్‌ ఎగుమతులతో పోల్చితే, ఈసారి 0.25 శాతం పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇవన్నీ జోరుగా..

ఏఆర్‌వీ (యాంటీ-రెట్రోవైరల్‌) ఔషధాలు, కేన్సర్‌ మందులకు తోడు యాంటీ-బయాటిక్స్‌, పారాసెట్మాల్‌, క్లోరోక్విన్‌ తదితర ఔషధాలను మనదేశం నుంచి ఇతరదేశాలు పెద్దఎత్తున కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఏప్రిల్‌లో ఔషధ ఎగుమతులు మెరుగ్గా నమోదైనట్లు సమాచారం.

ఈ దేశాలకు

అమెరికా, బ్రెజిల్‌, ఐరోపా, ఆఫ్రికా దేశాలు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ), క్లోరోక్విన్‌ ఫాస్పేట్‌, అజిత్రోమైసిన్‌, అమాక్సలిన్‌, పారాసెట్మాల్‌.. ఔషధాలను అధికంగా మనదేశం నుంచి తీసుకున్నాయి. క్లోరోక్విన్‌ మలేరియా వ్యాధిని అదుపు చేసేందుకు ఉద్దేశించిన మందు అయినప్పటికీ, దానికి కరోనా వైరస్‌ వ్యాధి రాకుండా నిరోధించే గుణం ఉన్నట్లు, వచ్చిన వారు సైతం త్వరగా కోలుకునేందుకు వీలుకల్పిస్తుందనే అభిప్రాయం ఏర్పడటంతో పలు దేశాలు ఈ ఔషధాన్ని పెద్దఎత్తున కొనుగోలు చేశాయి. దాదాపు 150కి పైగా దేశాలకు క్లోరోక్విన్‌ను ఎగుమతి చేశామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కరోనా వ్యాక్సిన్‌/ఔషధమైనా మన దగ్గరే తయారీ

ఔషధ ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరంలో బాగానే ఉంటాయని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. కరోనా వైరస్‌ వ్యాధికి వ్యాక్సిన్‌ కానీ, తగిన మందు కానీ కనుగొంటే, దాన్ని వెంటనే మనదేశంలో తయారు చేసి ఇతర దేశాలకు అందజేసే అవకాశం కోసం ఇక్కడి ఫార్మా కంపెనీలు ఎదురుచూస్తున్నాయి. అటువంటిదేదైనా జరిగితే ఔషధ ఎగుమతులు ఇంకా పెంచుకోవచ్చు.

ఈ విషయంలో పేటెంట్‌ నిబంధనలు ఉల్లంఘించకుండానే, ఇతరదేశాలకు ‘కరోనా’ మందు ఎగుమతి చేసే అవకాశాలు లేకపోలేదు. ‘రెమ్డిసివిర్‌’ ఔషధాన్ని తయారు చేసి, వందకు పైగా దేశాలకు ఎగుమతి చేసే ఒప్పందాన్ని మూడు దేశీయ కంపెనీలు అమెరికా చెందిన గిలీడ్‌ సైన్సెస్‌ తో కుదుర్చుకోడాన్ని దీనికి ఉదాహరణగా సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో తక్కువ ధరకు ఔషధాలు తయారు చేసే అందించే సత్తా ఉన్న మనదేశంలోని ఫార్మా కంపెనీలను విస్మరించలేని స్థితి ప్రపంచానికి ఏర్పడింది.

దేశీయ అమ్మకాలకు నీరసం...

అయితే దేశీయంగా మాత్రం అమ్మకాలు నీరసించినట్లు తెలుస్తోంది. ‘లాక్‌డౌన్‌’ వల్ల ఆసుపత్రుల్లో సాధారణ ఓపీ (అవుట్‌ పేషెంట్‌) సేవలు లేకపోవటం, అత్యవసరం కాని చికిత్సలు, శస్త్రచికిత్సలు వాయిదా వేసుకోవడం వల్ల ఔషధాల రిటైల్‌ అమ్మకాలు తగ్గాయి. ఔషధాల తయారీ ప్లాంట్లలో సిబ్బంది పూర్తిస్థాయిలో హాజరుకాలేకపోవటం, ముడిపదార్ధాల సరఫరాల్లో అవాంతరాలు, సరకు రవాణా సమస్యలూ ఎదురయ్యాయి.

అందువల్ల 2019 ఏప్రిల్‌తో పోలిస్తే, ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశీయంగా ఔషధ అమ్మకాలు 12 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. ‘లాక్‌డౌన్‌’ ఆంక్షల తొలిగాక, దేశీయంగా ఔషధ అమ్మకాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.

క్షీణత: విటమిన్లు, చర్మ- గ్యాస్ట్రో ఔషధాలు, నొప్పి నివారణ ఔషధాలు, బయోలాజికల్‌ ఔషధాల అమ్మకాలు

ఇవి మెరుగ్గా: మధుమేహం, గుండెజబ్బులకు సంబంధించి ఔషధాలు మెరుగ్గానే అమ్ముడయ్యాయి. ఇవి తప్పనిసరిగా వాడాల్సి రావడమే కారణం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.