ETV Bharat / business

ఆరో రోజూ పెట్రో మంట- ప్రస్తుత ధరలు ఇవే..

author img

By

Published : Aug 20, 2020, 11:34 AM IST

చమురు ధరలను వరుసగా ఆరో రోజూ పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగా ఇంధన ధరలను సవరించాయి. దీంతో దిల్లీ సహా ఇతర మెట్రో నగరాల్లో లీటర్​ పెట్రోల్ ధర 9 నుంచి 11 పైసల మేర పెరిగింది. ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి.

petrol price rise again
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

వరుసగా ఆరో రోజు పెట్రోల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​పై 10 పైసల మేర ధర పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. దీంతో లీటర్ పెట్రోల్ ధర దిల్లీలో రూ.81.06 వద్దకు చేరింది. లీటర్​ డీజిల్ ధర రూ.73.62 వద్ద స్థిరంగా ఉంది.

అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధర 45 డాలర్లు దాడింది. ఈ నేపథ్యంలో గత ఐదు రోజుల్లో పెట్రోల్ ధర 57 పైసలు పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.

ఇతర మెట్రో నగరాల్లోనూ 9 నుంచి 11 పైసల మేర పెట్రోల్ ధర పెరిగింది. డీజిల్ ధరలు మాత్రం గత రెండు వారాలుగా స్థిరంగా ఉన్నాయి.

ఇతర మెట్రో నగరాల్లో పెట్రోల్​, డీజిల్ ధరలు ఇలా

నగరం పెట్రోల్ -లీటర్డీజిల్-లీటర్​
హైదరాబాద్రూ.84.24రూ.80.23
బెంగళూరురూ.83.69రూ.77.94
ముంబయి రూ.87.74 రూ.80.17
కోల్​కతారూ.82.59రూ.77.11
చెన్నైరూ.84.14 రూ.78.91

ఇదీ చూడండి:రూ.8.4లక్షల కోట్ల రుణాల పునర్‌వ్యవస్థీకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.