దేశంలో పెట్రోల్ ధరల మంట సామాన్యులను ఇబ్బందులు పెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరల పెరుగుదలతో దేశీయ మార్కెట్లో వరుసగా నాలుగో రోజు పెట్రోల్ ధరను పెంచాయి చమురు సంస్థలు. తాజా పెరుగుదలతో పెట్రోల్ రేట్లు ఈ ఏడాది గరిష్ఠ స్థాయిని తాకాయి.
దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 12 పైసలు పెరిగింది. దిల్లీతో పాటు కోల్‌కతా, ముంబయిలోనూ ఇదే స్థాయిలో పెంపు ఉండగా.. చెన్నైలో పెంపు లీటరుపై 13 పైసలుగా ఉంది. అయితే.. డీజిల్ ధరల్లో మాత్రం మార్పు కనిపించలేదు.
నాలుగు రోజుల్లో 46 పైసలు..
వరుసగా నాలుగో రోజు పెట్రోల్ రేట్లు పెరగటం వల్ల దిల్లీలో వినియోగదారులపై 46 పైసల భారం పడింది. ప్రస్తుతం దిల్లీలో లీటరు పెట్రోల్ రేటు రూ.74.66, కోల్‌కతాలో రూ.77.34, ముంబయిలో రూ.80.32, చెన్నైలో రూ.77.62గా ఉంది.
డీజిల్ లీటర్‌కు దిల్లీలో రూ.65.73, కోల్‌కతాలో రూ.68.14, ముంబయిలో రూ.69.47గా ఉంది.
అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర సుమారు 3 డాలర్ల మేర పెరిగింది.
ఇదీ చూడండి: ఆభరణాలు ఉన్న బ్యాంక్ లాకర్‌కు బీమా అవసరమా?