దేశంలో వరుసగా ఆరో రోజూ చమురు ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 57 పైసలు, డీజిల్‌పై 59 పైసలు చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. కరోనా నేపథ్యంలో దాదాపు మూడు నెలలపాటు చమురు ధరలు పెంచని ఆయిల్ కంపెనీలు ఆదివారం నుంచి వరుసగా ధరలను పెంచుతున్నాయి.
దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.74.57, లీటర్ డీజీల్ ధర 72.81గా ఉంది. ఆయా రాష్ట్రాల్లో విధించే స్థానిక పన్నుల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ఉన్నాయి.
మొత్తంగా చూసుకుంటే... గత ఆరు రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.3.31, డీజిల్ ధర లీటర్‌కు రూ.3.42 మేర పెరిగాయి. ముడిచమురు ఉత్పత్తిని ఒపెక్ దేశాలు తగ్గించడమే... తాజా ధరల పెరుగుదలకు కారణం.
ఇదీ చూడండి: చిన్న రుణాలా.. కొన్నాళ్లు చూద్దాంలే