వరుసగా ఆరో రోజూ ఇంధన ధరలు పెరిగాయి. మొత్తం మీద ఈ ఒక్క నెలలోనే.. ధరలు పెరగటం ఇది ఎనిమిదోసారి. పెట్రోలుపై లీటరుకు 29 పైసలు, డీజిల్‌పై లీటరుకు 32 పైసల వరకు పెంచాయి చమురు సంస్థలు.
దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 88.73కు చేరింది. డీజిల్ లీటరు ధర రూ. 79.06కు పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటరు పెట్రోలు 28 పైసలు పెరిగి రూ. 95.19కి, డీజిల్ 34పైసలు పెరిగి రూ. 86.02కు చేరింది.
హైదరాబాద్‌లో..
హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌పై 30 పైసలు పెరిగి రూ.92.24కు చేరింది. డీజిల్‌పై 35 పైసలు పెరిగి రూ.86.22కు చేరింది.
ఇదీ చూడండి: ఒడిలో ల్యాపీకి.. అనువైన గ్యాడ్జెట్‌లు