దాదాపు రెండు నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం లీటర్ పెట్రోల్‌పై 17 పైసల మేర ధర పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. దీనితో లీటర్ పెట్రోల్ ధర దిల్లీలో రూ.81.23 వద్దకు చేరింది. లీటర్ డీజిల్ ధర 22 పైసలు పెరిగి.. రూ.70.68 వద్ద ఉంది.
దేశవ్యాప్తంగా ఇతర మెట్రో నగరాల్లోనూ లీటర్ పెట్రోల్ ధర 14 పైసల నుంచి 19 పైసలకు, డీజిల్ ధర లీటర్‌కు 20 పైసల నుంచి 25 వరకు పెరిగాయి.
మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా
నగరం | పెట్రోల్ | డీజిల్ |
హైదరాబాద్ | రూ.84.50 | రూ.77.13 |
బెంగళూరు | రూ.83.95 | రూ.74.92 |
ముంబయి | రూ.87.95 | రూ.77.12 |
కోల్‌కతా | రూ.82.82 | రూ.74.25 |
చెన్నై | రూ.84.33 | రూ.76.18 |
ధరల పెంపు ఎందుకు?
కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతమవుతున్నట్లు వస్తున్న వార్తలు.. అంతర్జాతీయంగా చమురు ధరల సూచీలకు కలిసొచ్చాయి. దీనితో క్రమంగా పెరుగుతున్న ధరల ఆధారంగా.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. వచ్చే వారం కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల నమోదవ్వచ్చని వెల్లడించాయి.
ఇదీ చూడండి:ఓలా 'ఈ-స్కూటర్లు' వచ్చేస్తున్నాయ్!