దేశంలో మరోసారి ముడిచమురు ధరలు పెరిగాయి. వరుసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు 25 పైసల చొప్పున పెరిగాయి. వారం రోజుల వ్యవధిలోనే చమురు ధరల్లో రూపాయి పెరుగుదల కనిపించింది. పెట్రోల్ గరిష్ఠంగా రూ. 85 దాటింది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.85.20 గా ఉంది. డీజిల్ ధర రూ. 75.38కి చేరింది.
ఈ నేపథ్యంలో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి : మరో ఆరు నెలల్లో వాట్సాప్‌లోకి జియోమార్ట్!