కరోనాతో పోరాడుతున్న భారత దేశానికి చేయూతనందించేందుకు పెప్సికో ఇండియా ముందుకొచ్చింది. తన మాతృసంస్థకు చెందిన పెప్సికో ఫౌండేషన్‌తో కలిసి 25,000 కొవిడ్-19 టెస్టింగ్ కిట్లు భారత్‌కు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఆకలితో అలమటిస్తున్న నిరుపేద కుటుంబాలకు 50 లక్షల భోజనాలు అందించనున్నట్లు పేర్కొంది.
'అక్షయ పాత్ర'తో కలిసి
పెప్సికో ఇండియా... వండిన భోజనం పంపిణీ చేయడానికి అక్షయ పాత్రతో, కుటుంబాలకు 'డ్రై ఫుడ్ రేషన్' అందించేందుకు స్మైల్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వీటి సాయంతో కరోనా బారిన పడిన 8,000 కుటుంబాలకు భోజన వసతి కల్పించనున్నట్లు పేర్కొంది.
పెప్సికో ఇండియా తన మాతృసంస్థకు చెందిన 'గివ్ మీల్స్, గివ్ హోప్' అనే గ్లోబల్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ దాతృత్వ కార్యక్రమం చేపట్టింది.
'ఫైండ్' భాగస్వామ్యంతో..
పెప్సికో ఇండియా 25,000 కొవిడ్-19 పరీక్ష కిట్లను భారత్‌కు అందించేందుకు... లాభాపేక్షలేని సంస్థ 'ఫౌండేషన్ ఆఫ్ ఇన్నోవేటివ్ న్యూ డయాగ్నోస్టిక్స్ (ఎఫ్ఐఎన్డీ)'తో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన 'ఎఫ్ఐఎన్డీ' ఇప్పటికే భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది.
యాపిల్ దాతృత్వం
కరోనా మహమ్మారితో పోరాడుతున్న వైద్య, ఆరోగ్య కార్యకర్తల కోసం త్వరలో వారానికి ఓ మిలియన్ ఫేస్ షీల్డ్స్ ఉత్పత్తి చేయనున్నట్లు యాపిల్ సంస్థ తెలిపింది.
-
Apple is dedicated to supporting the worldwide response to COVID-19. We’ve now sourced over 20M masks through our supply chain. Our design, engineering, operations and packaging teams are also working with suppliers to design, produce and ship face shields for medical workers. pic.twitter.com/3xRqNgMThX
— Tim Cook (@tim_cook) April 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Apple is dedicated to supporting the worldwide response to COVID-19. We’ve now sourced over 20M masks through our supply chain. Our design, engineering, operations and packaging teams are also working with suppliers to design, produce and ship face shields for medical workers. pic.twitter.com/3xRqNgMThX
— Tim Cook (@tim_cook) April 5, 2020Apple is dedicated to supporting the worldwide response to COVID-19. We’ve now sourced over 20M masks through our supply chain. Our design, engineering, operations and packaging teams are also working with suppliers to design, produce and ship face shields for medical workers. pic.twitter.com/3xRqNgMThX
— Tim Cook (@tim_cook) April 5, 2020
"ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్జికల్ మాస్కుల కొరతను తీర్చేందుకు యాపిల్ ఇప్పటికే 20 మిలియన్ మాస్కులను అందించింది. ఈ వారాంతానికి మరో మిలియన్ మాస్కులు అందించాలని ప్రణాళిక వేసుకున్నాం."- టిమ్ కుక్, యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ట్వీట్
యాపిల్ ఇప్పటికే సొంతంగా ఓ పారదర్శక మాస్కును రూపొందించి... అమెరికా, చైనాల్లోని తన కర్మాగారాల్లో భారీగా ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. అలాగే ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ ప్రాడా సహా అనేక కంపెనీలతో కలిసి మాస్కుల ఉత్పత్తికి కృషి చేస్తోంది ఈ దిగ్గజ సంస్థ. ముందుగా అమెరికాకు వీటిని అందించి, తరువాత ప్రపంచ దేశాలకు కూడా పంపిణీ చేయాలని యాపిల్ భావిస్తోంది.
ఇదీ చూడండి: జీవిత బీమా ప్రీమియం చెల్లింపునకు గడువు పెంపు