ETV Bharat / business

పెన్షనర్లకు హై అలర్ట్.. రెండు రోజులే గడువు!

author img

By

Published : Nov 28, 2021, 1:06 PM IST

ప్రభుత్వం నుంచి పెన్షన్​ పొందుతున్నవారికి హై అలర్ట్​.​ వార్షిక జీవన ధ్రువీకరణ పత్రాన్ని (Pensioners Life Certificate 2021) సమర్పించడానికి గడువు దగ్గరపడుతోంది. ఇంకా రెండు రోజులే ఉంది. ఇది పత్రాన్ని సమర్పించకుంటే.. మీ పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది!

Pensioners Life Certificate online
పెన్షనర్లకు హై అలర్ట్

పెన్షనర్లకు ముఖ్య గమనిక! వార్షిక జీవిత ధ్రువీకరణ (లైఫ్ సర్టిఫికేట్) పత్రాన్ని (Pensioners Life Certificate 2021) వెంటనే సమర్పించడానికి ఇంకా రెండు రోజులే గడువు(నవంబర్ 30 వరకు) ఉంది. ఇప్పటికే ఈ సర్టిఫికేట్​ను సమర్పించి ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఇంకా ఈ పత్రాన్ని సమర్పించకపోతే తక్షణమే ఆ పని పూర్తి చేయండి. లేకపోతే పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది! 80 ఏళ్లు పైబడిన వ్యక్తులు అక్టోబర్ 1 నుంచే లైఫ్ సర్టిఫికేట్లను సమర్పిస్తున్నారు. వీడియో కాల్ ద్వారా కూడా ఈ సర్టిఫికేట్ సమర్పించే అవకాశం ఉంది.

ఎలా సమర్పించవచ్చంటే..

  • లైఫ్ సర్టిఫికేట్​ను (Pensioners Life Certificate 2021) సమర్పించేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇలా..
  • పెన్షన్ అందిస్తున్న బ్యాంకు బ్రాంచ్​కు వెళ్లి సమర్పించవచ్చు.
  • జీవన్ ప్రమాణ్ పోర్టల్​లోకి వెళ్లి ఆధార్ ద్వారా డిజిటల్ రూపంలో లైఫ్ సర్టిఫికేట్ (Pensioners Life Certificate online) అందించొచ్చు.
  • బ్యాంకింగ్ డోర్​స్టెప్ ఫెసిలిటీ ద్వారా కూడా సర్టిఫికేట్ (Pensioners Life Certificate form) సమర్పించవచ్చు. దీనికోసం 'డోర్​స్టెప్ బ్యాంకింగ్ యాప్​'లో వివరాలు నమోదు చేసుకొని పెన్షన్ అకౌంట్​ నెంబర్​ను ధ్రువీకరించాలి. కనీస రుసుముతో ఈ పని అయిపోతుంది. బ్యాంకు ప్రతినిధులే మీ ఇంటికి వచ్చి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే ప్రక్రియను పూర్తి చేస్తారు.
  • పోస్ట్​మ్యాన్ ద్వారా ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. ఇందుకోసం పోస్ట్ ఇన్పో మొబైల్ యాప్ లేదా ప్రభుత్వ వెబ్​సైట్​కి వెళ్లి డోర్​స్టెప్ రిక్వెస్ట్ కోసం నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత మొబైల్​కు 'ప్రమాణ్ ఐడీ' వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ వెసులుబాటు ఉంది. ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా సరే.. ఈ సేవను వినియోగించుకోవచ్చు. ఇందుకోసం రూ.70 చెల్లించాల్సి ఉంటుంది.
  • ఎస్​బీఐ వీడియో కాల్ ఫీచర్
  • దీంతో పాటు తొలిసారి 'వీడియో లైఫ్ సర్టిఫికేట్​' సేవలను ఎస్​బీఐ ప్రవేశపెట్టింది. నవంబర్ 1 నుంచి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. దీన్ని ఉపయోగించుకొని ఫించనుదారులు.. తమ లైఫ్ సర్టిఫికేట్లను వీడియో కాల్ చేసి సమర్పించవచ్చు.

ఎలా చేయాలంటే...?

  • ఎస్​బీఐ పెన్షన్ సేవ పోర్టల్​లోకి వెళ్లి 'వీడియో ఎల్​సీ' అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • ఎస్​బీఐ పెన్షన్ ఖాతా నెంబర్​ను ఎంటర్ చేసి.. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్​కు వచ్చిన ఓటీపీని వెబ్​సైట్​లో నమోదు చేయాలి.
  • టర్మ్స్ అండ్ కండిషన్స్​ను యాక్సెప్ట్ చేసి స్టార్ట్ జర్నీ అనే బటన్​పై క్లిక్ చేయాలి.
  • ఒరిజినల్ పాన్ కార్డును దగ్గర పెట్టుకోవాలి. ఆ తర్వాత 'ఐయామ్ రెడీ' అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • ఎస్​బీఐ అధికారులు అందుబాటులోకి రాగానే వీడియో కాల్ ప్రారంభం అవుతుంది.
  • స్క్రీన్ మీద కనిపించే నాలుగు అంకెల వెరిఫికేషన్ కోడ్​ను అధికారులు అడుగుతారు.
  • ఆ తర్వాత పాన్​కార్డు ఒరిజినల్​ను చూపించాలి. దాన్ని ఫొటో తీసుకుంటారు.
  • అనంతరం పెన్షనర్ ఫొటోను తీసుకుంటారు. దీంతో వీడియో లైఫ్ సర్టిఫికేట్ నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.
  • ఒకవేళ ఈ ప్రక్రియ విఫలమైతే.. బ్యాంకు ద్వారా మొబైల్ నెంబర్​కు సందేశం వస్తుంది.

ఇదీ చూడండి: ఈ ప్రక్రియ పూర్తి చేశారా? లేకపోతే పీఎఫ్‌ జమ కాదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.