పేటీఎం(Paytm IPO) మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ రూ.18,300 కోట్ల ఐపీఓ.. పూర్తి సబ్స్క్రిప్షన్లు(paytm ipo subscription) సాధించింది. ఆఖరి రోజున విదేశీ మదుపర్లు ఎక్కువగా బిడ్లు దాఖలు చేయడం వల్ల సమీకరణ లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది. మొత్తం 4.83 కోట్ల షేర్లు ఇష్యూకు ఉంచగా.. 5.24 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలైనట్లు స్టాక్ మార్కెట్ల వద్ద లభ్యమైన డేటా ద్వారా వెల్లడైంది.
అర్హులైన సంస్థాగత మదుపర్లు(క్యూఐబీ) మొత్తం 2.63 కోట్ల షేర్లు రిజర్వు చేయగా.. 1.59 రెట్లు అధికంగా బిడ్లు దాఖలైనట్లు తెలిసింది. విదేశీ సంస్థాగత మదుపర్ల నుంచి 4.17 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చినట్లు డేటా పేర్కొంది.
వ్యక్తిగత రిటైల్ ఇన్వెస్టర్లకు మొత్తం 87.98 లక్షల షేర్లు రిజర్వు చేయగా.. 1.28 (1.46 రెట్ల) కోట్ల షేర్లకు బిడ్లు అధికంగా దాఖలైనట్లు తెలిసింది.
నాన్ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 1.31 కోట్ల షేర్లు రిజర్వు చేయగా.. కేవలం 8 శాతానికే బిడ్లు వేసినట్లు తెలిసింది.
ఐపీఓ సబ్స్క్రిప్షన్ నవంబరు 8న(Paytm IPO date) ప్రారంభమవగా.. బుధవారం (నవంబరు 10) ముగియనుంది. దేశీయంగా ఇదే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ.
ఇదీ చూడండి: Nykaa IPO: నైకా అరంగేట్రం అదరహో.. 80% ప్రీమియంతో లిస్ట్