ETV Bharat / business

పేటీఎం గుడ్‌న్యూస్‌- ఆ ఛార్జీలన్నీ రద్దు - పేటీఎం వ్యాపారుల ఛార్జీలు

వ్యాపారులు చేసే లావాదేవీలపై అన్ని రకాల ఛార్జీలను పేటీఎం రద్దు చేసింది. పేటీఎం వ్యాలెట్‌, యూపీఐ యాప్స్‌, రూపే కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయబోమని స్పష్టం చేసింది. సుమారు 1.7కోట్ల మంది వ్యాపారులకు ఈ నిర్ణయం ద్వారా లబ్ధి చేకూరనుంది.

Paytm waives charges on merchant transactions
పేటీఎం గుడ్‌న్యూస్‌- ఆ ఛార్జీలన్నీ రద్దు
author img

By

Published : Dec 1, 2020, 10:31 PM IST

ప్రముఖ చెల్లింపుల సంస్థ పేటీఎం.. వ్యాపారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వ్యాపారులు చేసే లావాదేవీలపై అన్ని రకాల ఛార్జీలను రద్దు చేసింది. ఇకపై పేటీఎం వ్యాలెట్‌, యూపీఐ యాప్స్‌, రూపే కార్డుల ద్వారా చేసే పేమెంట్స్‌పై ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయబోమని పేర్కొంది. ఇది వ్యాపారులకు లాభం చేకూర్చి వారి వ్యాపారాభివృద్ధికి తోడ్పడుతుందని పేటీఎం ఓ ప్రకటనలో పేర్కొంది.

పేటీఎం ఆల్‌ఇన్‌ వన్‌ క్యూఆర్‌, పేటీఎం సౌండ్‌ బాక్స్‌, పేటీఎం ఆల్‌ ఇన్‌ వన్‌ ఆండ్రాయిడ్‌ పీవోఎస్‌ వాడుతున్న సుమారు 1.7కోట్ల మంది వ్యాపారులకు ఈ నిర్ణయం ద్వారా లబ్ధి చేకూరనుందని పేటీఎం తెలిపింది.

అంతేకాకుండా ఇది డిజిటల్‌ పేమెంట్స్‌ దిశగా వ్యాపారులను ప్రోత్సహించడమే కాకుండా, డిజిటల్‌ ఇండియా కలను సాకారం చేయడానికి తోడ్పడుతుందని పేటీఎం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కుమార్‌ ఆదిత్య తెలిపారు. సూక్ష్మ, చిన్న మధ్యతరహా వ్యాపార వర్గాలను ప్రోత్సహించేందుకు రూ.600 కోట్ల మేర ఎండీఆర్‌ ఛార్జీల భారాన్ని పేటీఎం భరిస్తుందని తెలిపారు. అలాగే పేమెంట్స్‌ను నేరుగా పేటీఎం వ్యాలెట్‌కు లేదా తమ బ్యాంక్‌ అకౌంట్‌కు బదిలీ చేసుకునే వెసులుబాటునూ వ్యాపారులకే కల్పిస్తున్నట్లు తెలిపారు.

వచ్చే ఏడాది మార్చి నాటికి ఎంఎస్‌ఎంఈలకు రూ.1000 కోట్ల మేర రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేటీఎం ప్రకటనలో పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.