ETV Bharat / business

రోటీపై 5% జీఎస్టీ- పరోటాపై 18%... ఎందుకిలా? - Parota 18% GST

రాత్రి డిన్నర్​లో ఎక్కువ మంది అల్పాహారం తీసుకుంటారు. ఇందులో రోటీ, పరోటా, దోశ వంటి ఆహార పదార్థాలకు ప్రజలు ఎక్కువగా మొగ్గుచూపుతారు. అయితే... రోటీపై 5 శాతం జీఎస్​టీ ఉండగా.. పరోటాను 18 శాతం జీఎస్​టీ శ్లాబులో చేర్చారు. ప్రస్తుతం ఈ వర్గీకరణ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

parota 18 percent gst
పరోటా జీఎస్​టీ
author img

By

Published : Jun 12, 2020, 3:11 PM IST

పరోటా, రోటీ.. రుచి వేరేగా ఉన్నా చూడటానికి ఓకేలా ఉంటాయి. తయారీకి దాదాపుగా అంతే సమయం పట్టొచ్చు. అయితే రెండింటిలో పరోటా తినాలంటే మాత్రం మీ జేబుకు కాస్త ఎక్కువ చిల్లు పడొచ్చు. ఇందుకు కారణం జీఎస్‌టీ. రోటీపై 5 శాతం మాత్రమే వస్తు, సేవల పన్ను వేయగా.. పరోటాపై మాత్రం 18 శాతం విధించారు.

ఇలా వర్గీకరణ...

'పరోటా'ను చాప్టర్​ హెడ్డింగ్ 2106 కింద వర్గీకరించింది అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్​) కర్ణాటక. ఈ నిర్ణయం ప్రకారం పరోటా అనేది సాదా చపాతీ లేదా రోటీ కాదు కాబట్టి 18% జీఎస్​టీ దానికి వర్తిస్తుందని నిర్ణయించింది. ఐడీ ఫ్రెష్ ఫుడ్ అనే ఆహార ఉత్పత్తుల సంస్థ వేసిన దరఖాస్తుకు స్పందనగా ఈ విషయాన్ని వెల్లడించింది ఏఏఆర్​.

గోధుమ పరోటా, మలబార్ పరోటా తయారీని 1905వ అధ్యాయం కింద వర్గీకరించాలా? అనే అంశంపై దరఖాస్తుదారు స్పష్టత కోరారు. పరోటాపై జీఎస్‌టీని 5 శాతం ఉంచాలని కోరగా.. ఆ నిర్ణయాన్ని తిరస్కరించింది ఏఏఆర్​.

రోటీ ఆనేది 'రెడీ టూ కుక్​' విభాగం కిందకు వస్తుంది కాబట్టి... దాన్ని1905 అధ్యాయంలో పెట్టినట్లు స్పష్టం చేశారు. వీటికి మాత్రమే 5 శాతం జీఎస్​టీ నిబంధన వర్తిస్తుందన్నారు. పరోటా అనేది.. వేడి చేయాల్సి ఉంటుంది కాబట్టి 2106 శీర్షిక కింద వర్గీకరించామని.. ఫలితంగా దానికి 18 శాతం జీఎస్​టీ ఉంటుందని చెప్పారు.

ఇదీ చూడండి:నింబు షరబత్ ఉండగా.. నీరసంపై దిగులేల దండగ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.