ETV Bharat / business

దుమ్ములేపిన 'పార్లే-జీ'... 80 ఏళ్ల రికార్డు బ్రేక్​ - దుమ్ములేపిన 'పార్లే-జీ' అమ్మకాలు.. 80 ఏళ్ల రికార్డు బ్రేక్​

కరోనా కాలంలో సంస్థలన్నీ నష్టాలతో ఇబ్బందులు పడుతుంటే.. ప్రముఖ బిస్కెట్ల తయారీ సంస్థ 'పార్లే' మాత్రం లాభాల్లో దూసుకెళ్లింది. ఏకంగా 80 ఏళ్ల కాలంలో అత్యధిక అమ్మకాల రికార్డు సాధించింది.

parleG biscuits
పార్లేజీ అమ్మకాలు
author img

By

Published : Jun 9, 2020, 4:48 PM IST

కొవిడ్​-19 కారణంగా విధించిన లాక్​డౌన్​తో చాలా సంస్థలు నష్టాలు ఎదుర్కొంటే.. 'పార్లే-జీ' మాత్రం రికార్డు స్థాయి అమ్మకాలతో లాభాల బాటలో దూసుకెళ్లింది. ఏకంగా ఎనభై ఏళ్ల సేల్స్ రికార్డులన్నీ కేవలం మూడే నెలల్లో తుడిచేసింది.

మార్చి, ఏప్రిల్​, మే నెలల్లో భారీ స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు తెలిపారు పార్లే సంస్థ ప్రతినిధులు. 1938లో ప్రారంభమైన ఈ సంస్థ లాక్​డౌన్​లో అత్యధిక అమ్మకాలు సాధించిందట. అయితే పూర్తి గణాంకాలు చెప్పేందుకు సంస్థ ప్రతినిధులు నిరాకరించారు. ఈ సేల్స్​ వల్ల మార్కెట్​ షేర్​ 5 శాతం పెరిగినట్లు చెప్పారు. ఇందులో 80-90 శాతం వృద్ధి పార్లే-జీ బిస్కెట్ల అమ్మకాల వల్లే వచ్చినట్లు స్పష్టం చేశారు. ఈ సంస్థతో పాటు బ్రిటానియా గుడ్​ డే, టైగర్​, మిల్క్​ బికీస్, బార్బన్​, క్రాక్​జాక్​, మొనాకో, హైడ్​ అండ్​ సీక్​ విపరీతంగా అమ్మకాలు సాధించాయి.

అవాక్కయ్యే విషయం...

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడయ్యే బిస్కెట్లలో 'పార్లే-జీ' సంస్థ టాప్​లో ఉంటుంది. ప్రతిరోజు 400 మిలియన్​ ప్యాకెట్లు అమ్ముడవుతాయని అంచనా. బిస్కెట్లను పక్కపక్కన చంద్రుడి నుంచి భూమికి పేర్చుకుంటూ వస్తే నెలలో ఉత్పత్తి అయ్యే వాటితో ఒక లైన్​ గీయొచ్చట. అదే సంవత్సరానికి అమ్ముడయ్యే బిస్కెట్లను గనుక భూమి చుట్టూ పేరిస్తే.. ఏకంగా 192 సార్లు ధరణిని చుట్టేయొచ్చట. ప్రస్తుతం ఈ బిస్కెట్ల ధర కేజీ 177 రూపాయలుగా ఉంది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 130 ఫ్యాక్టరీలు ఉన్నాయి.

ఇదీ చూడండి: ఆ చమురు సంస్థలో 10 వేల ఉద్యోగాలు కట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.