car recall: అమెరికాలో తమ కార్లు కొన్న కొంత మంది వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థలైన కియా, హ్యుందాయ్ హెచ్చరించాయి. సాంకేతికపరమైన లోపాల కారణంగా ఇంజన్లో మంటలు వస్తున్నాయని తెలిపాయి. కార్లు ఆన్ చేసిన సమయంలోనే గాక పార్క్ చేసిన సమయంలో కూడా మంటలు వస్తున్నట్లు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో.. కార్లను ఇంట్లో పార్కు చేయవద్దని.. బయట పెట్టాలని వాహన యజమానులకు సూచించాయి. దీంతో సుమారు 4 లక్షల 85 వేల కార్లను రీకాల్ చేసినట్లు పేర్కొన్నాయి.
గత ఆరేళ్ల నుంచి ఈ కొరియన్ ఆటో మొబైల్ దిగ్గజాలు ఇంజిన్‌లో మంటలు వచ్చే సమస్యలను ఎదుర్కొంటున్నాయి. గతంలో కూడా కియా 3 లక్షల 80వేల కార్లను రీకాల్ చేసింది. ఈసారి సమస్య యాంటీ లాక్ బ్రేక్ కంట్రోల్ మాడ్యూల్‌లో వచ్చినట్లు పేర్కొంది. దీని వల్ల ఎలక్ట్రిక్ షార్ట్ సర్కూట్ అయి మంటలు చెలరేగుతున్నట్లు తెలిపింది.
ప్రధానంగా కియా స్పోర్టేజ్ ఎస్యూవీ 2014, 2016 మోడల్స్‌తో పాటు 2016, 2018 కే900 సెడాన్ వాహనాల్లో కూడా ఈ ఇబ్బందులు ఉన్నట్లు సంస్థ తెలిపింది. హ్యూందాయ్లోని 2016, 2018 సాంటా ఫే ఎస్యూవీ, 2017, 2018 సాంటా ఫే స్పోర్ట్స్, 2019 సాంటా పే ఎక్స్ఎల్తో పాటు 2015 టక్సన్ ఎస్‌యూవీల్లో మంటలు చెలరేగే ప్రమాదం ఉన్నట్లు సంస్థ పేర్కొంది.
కార్లలో మంటలు చెలరేగిన ఘటన అమెరికాలో సుమారు 11 నమోదు అయినట్లు చెప్పాయి సంస్థలు. అయితే వాహనదారులకు ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నాయి. వాటి రిపేర్ పూర్తి అయ్యే అంతవరకు వాటిని ఆరుబయ పార్క్ చేయాలని అమెరికా సేఫ్టీ రెగ్యూలేటర్స్ కారు యజమానులకు సూచించారు. ఇందుకు సంబంధించిన ఫ్యూజ్‌ను డీలర్లు రీప్లేస్ చేస్తారని స్పష్టం చేశాయి.
ఇవీ చూడండి:
ఆసియా కుబేరుడు అదానీ- రెండో స్థానానికి ముకేశ్ అంబానీ
హ్యుందాయ్ 'కశ్మీర్ పోస్ట్'పై కేంద్రం సీరియస్- దక్షిణ కొరియా సారీ!