ETV Bharat / business

పిల్లలకు ల్యాపీలిద్దాం.. సెల్‌ఫోన్‌ కంటే ఇదే మేలేమో!

కొవిడ్‌-19 సంక్షోభంలో పని వాతావరణంతో పాటు పాఠశాలలు, కళాశాలల బోధన తీరు కూడా పూర్తిగా మారింది. గతంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సొంత ల్యాప్‌టాప్‌ లేదా డెస్క్‌టాప్‌ కలిగి ఉండేవారు. మరికొందరు తమ అవసరాల మేరకే ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేసేవారు. అయితే కొవిడ్‌ వల్ల పిల్లలకు బోధన అంతా ఆన్‌లైన్‌లో సాగడం, ఇంట్లో నుంచే పనిచేయాల్సి వస్తున్నందున ల్యాప్‌టాప్‌ కొనుగోళ్లు బాగా అధికమయ్యాయి. స్మార్ట్‌ఫోన్ల తెరలపై చూడటం కంటే పెద్ద తెరపై అయితే కళ్లకు ఒత్తిడి తగ్గుతుందనే భావనే ఇందుకు ప్రధాన కారణం.

Parents gives laptop to their children cause of coronavirus pandemic
పిల్లలకు ల్యాపీలిద్దాం.. సెల్‌ఫోన్‌ కంటే ఇదే మేలే!
author img

By

Published : Jul 5, 2020, 8:05 AM IST

స్మార్ట్‌ఫోన్‌ సాయంతో పాఠ్యాంశాలు నేర్చుకోవడం పిల్లలకు కష్టంగానే ఉంటోంది. అయితే ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌ బోధనను తప్పనిసరి చేయడం సహా పాఠ్యాంశాలు బోధిస్తున్నందున, పలు కుటుంబాల్లో పెద్దలు తమ స్మార్ట్‌ఫోన్లనే ఇస్తూ సరిపెడుతున్నారు. అయితే కనీసం జులై కన్నా, పరిస్థితి తెరపిన పడుతుందని, సాధారణ పద్ధతుల్లో తరగతులు సాగుతాయని భావించిన వారికి అడియాశే మిగిలింది. కొవిడ్‌-19 కేసులు అంతకంతకూ పెరుగుతుండటం వల్ల విద్యా సంస్థలు భౌతికంగా ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయమై సందేహం నెలకొంది.

సాఫ్ట్‌వేర్‌ సంస్థలు కూడా ఉద్యోగులను ఇళ్ల నుంచే పనిచేయమని కోరుతున్నాయి. ఈ నెలాఖరు వరకు ఇంటినుంచే పనిచేయించమని ప్రభుత్వమే ఆదేశించింది. కొన్ని సంస్థలు డిసెంబరు వరకు ఇదే విధానం కొనసాగించాలంటున్నాయి. మరిన్ని నెలల పాటు ఇంటి నుంచే పనిచేసుకునేందుకు పెద్దలు, పిల్లలకు ఆన్‌లైన్‌ బోధన సులభంగా ఉండేందుకు ల్యాప్‌టాప్‌లు కొంటున్నారు. పిల్లల కోసం 8-12 అంగుళాల తెర ఉండే ట్యాబ్లెట్‌లనూ కొందరు కొంటున్నారు.

అయితే ఉన్నత విద్య వరకు పనికొస్తుందనే భావనతోనే ల్యాప్‌టాప్‌ కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారని విక్రయశాలల ప్రతినిధులు చెబుతున్నారు. ఇంటర్‌ పూర్తయిన వారైతే, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే, విదేశాల నుంచి వచ్చే బంధువులు, స్నేహితులతో ల్యాప్‌టాప్‌లను తెప్పించుకునేవారు. మార్చి నుంచే విమానాలు లేక ఇప్పుడా అవకాశమే లేకపోయింది. అందుకే అక్కడితో పోలిస్తే, ఇక్కడ ధర కాస్త అధికమైనా, కొనుగోలు చేయకతప్పడం లేదు.

ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లు

చైనా నుంచి దిగుమతులు నిలిపేయడం, సుంకాల భారం వల్ల స్మార్ట్‌ఫోన్ల ధరలను కంపెనీలు పెంచేస్తున్నాయి. రూ.10-15 వేల ధరల శ్రేణికి అధిక డిమాండ్‌ ఉండగా, వీటి సరఫరా సక్రమంగా లేదని విక్రయశాలల ప్రతినిధులు చెబుతున్నారు. ల్యాప్‌టాప్‌ల విషయానికొస్తే హెచ్‌పీ, డెల్‌, లెనోవా, ఆసుస్‌, ఏసర్‌ వంటి సంస్థల ఉత్పత్తులు ఆఫర్లపైనా లభిస్తున్నాయి. యాపిల్‌ మ్యాక్‌బుక్‌ల విక్రయాలూ అధికంగానే సాగుతున్నాయి. ఆయా కంపెనీల ల్యాప్‌టాప్‌లపై 20-30% వరకు రాయితీని సంస్థలు ఇస్తున్నాయి. రిలయన్స్‌ డిజిటల్‌, క్రోమా వంటి గొలుసుకట్టు విక్రయశాలలతో పాటు అమెజాన్‌ వంటి ఇ-కామర్స్‌ పోర్టళ్లలోనూ ఆఫర్లపై విక్రయిస్తున్నారు.

విద్యార్థి ఐడీ కార్డుపై 20-45 శాతం రాయితీ

విద్యార్థుల ఐడీకార్డు నమోదు చేసుకుని, ఆయా సంస్థల ల్యాప్‌టాప్‌లపై 20-45 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు హైదరాబాద్‌లోని ఐటీ మాల్‌ ఎండీ అహ్మద్‌ తెలిపారు. రూ.25,000 మొదలుకుని తమ వద్ద ల్యాప్‌టాప్‌లు లభిస్తాయన్నారు. ల్యాప్‌టాప్‌ కొత్తదా లేక రీఫర్బిష్‌ చేసింది విక్రయిస్తున్నారా అనేది కూడా పరిశీలించుకోవచ్చని, ఆన్‌లైన్‌లో తయారీ సంస్థ వెబ్‌సైట్‌లో ల్యాప్‌టాప్‌ ప్రోడక్ట్‌ నెంబరు నమోదు చేస్తే, ఏదనేది తేలుతుందన్నారు. ఈ విషయంలో వినియోగదార్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా సంస్థ లేదా వ్యక్తి కనుక 25 అంతకుమించి కొనుగోలు చేస్తే, ధరను బట్టి 25-45 శాతం రాయితీ ఇస్తామని కూడా వివరించారు.

ఇదీ చూడండి: 'భారత్​పై చైనా డేటా అస్త్రం- స్వయం సమృద్ధే పరిష్కారం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.