సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ ఆదాయం, లాభం, పన్ను చెల్లింపులపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ప్రశ్నలు సంధించింది. దేశంలోని ఖాతాదారుల డేటా భద్రత, గోప్యత కోసం.. సంస్థ ఆదాయంలో ఎంత మేరకు ఖర్చు చేస్తున్నారని అడిగింది.
తమ ఆదేశాల మేరకు హాజరైన ఫేస్బుక్ ప్రతినిధి అంకి దాస్‌ను రెండు గంటల పాటు ప్రశ్నించింది సంయుక్త పార్లమెంటరీ కమిటీ. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలు.. తమ ప్రకటనదారుల వాణిజ్య ప్రయోజనాలు, ఎన్నికల ప్రయోజనాల కోసం తమ ఖాతాదారుల డేటా నుంచి ఎటువంటి వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోకూడదని సూచించింది.
అమెరికా ఎన్నికల్లోనూ జోక్యం చేసుకుంటోందనే ఆరోపణను ఎదుర్కుంటోంది ఫేస్బుక్. ఈ నేపథ్యంలో ఆ సంస్థలో ఎక్కువమంది ఉద్యోగులు ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలపై కూడా ఆందోళనలు చెలరేగాయి.
సామాజిక మాధ్యమం దుర్వినిగియోగం జరుగుతుందనే ఆరోపణలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ ముందు ఫేస్బుక్ ఇండియా అధినేత అజిత్ మోహన్ గత నెల హాజరయ్యారు.
ఇదీ చూడండి: ఫేస్బుక్, ట్విట్టర్‌కు పార్లమెంటరీ కమిటీ సమన్లు