పాన్ కార్డు వివరాలను ఆధార్ కార్డుతో అనుసంధానించుకోవడం తప్పనిసరని ఆదాయపుపన్ను విభాగం పునరుద్ఘాటించింది. ఇందుకు మార్చి 31 తుది గడువు అని సోమవారం స్పష్టంచేసింది. గడువు లోపల ఆధార్‌తో అనుసంధానించుకోని పాన్ కార్డు పనిచేయదని గత నెలలోనే ఆదాయపుపన్ను విభాగం పేర్కొన్న సంగతి తెలిసింది. ‘‘బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ, ఎన్‌ఎస్‌డీఎల్, యూటీఐటీఎస్‌ఎల్ పాన్ సేవా కేంద్రాల ద్వారా కూడా మీరు అనుసంధానించుకోవచ్చు’’ అని సోమవారం విడుదలచేసిన ఓ ప్రకటనలో ఆదాయపుపన్ను విభాగం స్పష్టంచేసింది. ఈ మేరకు తన ట్విటర్ హ్యాండిల్‌లో ఓ వీడియో సందేశం ఉంచింది. రెండు మార్గాల్లో అనుసంధానం ప్రక్రియను పూర్తిచేయవచ్చని అందులో పేర్కొంది. అవి..
- UIDPAN<SPACE>12digit Aadhaar><space>10digitPAN> అన్న సందేశాన్ని 567678, 56161 నంబర్లలో ఏదో ఒకదానికి పంపాలి.
- www.incometaxindiaefiling.gov.in లోకి వెళ్లి అనుసంధానించుకోవచ్చు.