ETV Bharat / business

'టీ బడ్డీల్లోనూ డిజిటల్‌ చెల్లింపులు' - యూపీఐ చెల్లింపులు

దేశంలో ఆన్‌లైన్‌, యూపీఐ చెల్లింపులు క్రమంగా పెరుగుతున్నాయని ఎన్‌పీసీఐ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ప్రవీణా రాయ్‌ తెలిపారు. రూపే కార్డు వినియోగమూ బాగా పెరిగిందన్నారు. లావాదేవీల భద్రతే మాకు ముఖ్యమని వివరించారు.

NPCI PRAVEENA ROY
ప్రవీణా రాయ్‌
author img

By

Published : May 25, 2021, 7:03 AM IST

నగదు లావాదేవీలే అధికంగా చోటుచేసుకునే మన దేశంలో.. ఇప్పుడు ఆన్‌లైన్‌, కార్డు, యూపీఐ చెల్లింపులు పెరుగుతున్నాయి. ఎంతమొత్తమైనా, పైసలతో సహా అవసరమైన మేరకే చెల్లించగలగడంతో గ్రామీణులూ డిజిటల్‌ చెల్లింపులకు మారుతున్నారు. వీటిని మరింత ప్రోత్సహించడంతో పాటు, అవసరమైన మౌలిక వసతుల కల్పనకూ ప్రభుత్వం, ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐ చర్యలు తీసుకుంటున్నాయని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ప్రవీణా రాయ్‌ తెలిపారు. రూపే కార్డుల విస్తృతి, సైబర్‌ మోసాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను 'ఈనాడు' ఇంటర్వ్యూలో వివరించారు.

కొవిడ్‌-19 తర్వాత డిజిటల్‌ లావాదేవీలు బాగా పెరిగాయి. భద్రత కోసం ఎన్‌పీసీఐ ఏం చేస్తోంది?

మహమ్మారి వ్యాప్తి నుంచి డిజిటల్‌ లావాదేవీలు బాగా పుంజుకున్నాయి. దీనికి తగ్గట్టుగానే నియంత్రణ సంస్థ, ప్రభుత్వం విధానాలను రూపొందించింది. సంప్రదాయ నగదు చెల్లింపుల నుంచి డిజిటల్‌ వైపు మారే దశలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఎన్‌పీసీఐ పూర్తి చర్యలు తీసుకుంది. వినియోగదారులు, వ్యాపారులు కొత్త విధానానికి మారేలా ప్రోత్సహించాం. చెల్లింపు సేవలు అందించే భాగస్వాములు మార్కెట్‌ అవసరాలకు తగ్గట్టు వినూత్న ఆవిష్కరణలు చేశారు. ఆర్థిక లావాదేవీల నిర్వహణ సురక్షితంగా జరగడంతో పాటు, ఆ వ్యవహారాలకు బలమైన రక్షణ ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలనూ ఎన్‌పీసీఐ తీసుకుంటోంది.

దేశీయంగా రూపే కార్డు వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఏం చేస్తున్నారు?

దేశీయ లావాదేవీల్లో 34 శాతం మార్కెట్‌ వాటాను రూపే కార్డు సొంతం చేసుకుంది. దాదాపు 60 కోట్లకు పైగా కార్డులను జారీ చేశాం. రూపే కాంటాక్ట్‌ లెస్‌ కార్డులనూ అందుబాటులోకి తెచ్చాం. కార్డుతో చెల్లింపులు జరిపే వారికి రూపే ఆటోపే (రీఛార్జ్‌, ఫీజులు తదితరాలకు సంబంధించి), రూపే సాఫ్ట్‌ పీఓఎస్‌ లాంటి వెసులుబాట్లను ఎన్‌పీసీఐ తీసుకొచ్చింది. ఆర్‌బీఐ కాంటాక్ట్‌లెస్‌ చెల్లింపుల పరిమితిని రూ.2,000 నుంచి రూ.5,000కు పెంచడంతో ఈ కార్డులకు దేశంలో విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఆర్థిక శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులను రూపే కార్డులు వాడాల్సిందిగా కోరింది. ఫలితంగా మరింత గిరాకీ వస్తుంది.

పూర్తిగా నగదు రహిత సమాజంగా మారడం సాధ్యమేనా?

రెండో దశ కొవిడ్‌-19 తర్వాత లావాదేవీలు తాత్కాలికంగా నెమ్మదించాయి. డిజిటల్‌ చెల్లింపుల్లో ఉండే రక్షణ, సౌకర్యాల వల్ల రానున్న రోజుల్లో మరింత మంది వినియోగదారులు దీన్ని వినియోగించుకునేందుకు ముందుకు వస్తారు. కాబట్టి, విలువ, సంఖ్యా పరంగా ఈ లావాదేవీల్లో వృద్ధి కనిపిస్తుంది. దేశంలోని ప్రతి ఒక్కరూ యూపీఐ వినియోగించుకునేలా అందుబాటులోకి తెస్తాం. ఇప్పటికే టీ బడ్డీలు, కిరాణా దుకాణాలతో పాటు, వ్యక్తుల నుంచి వ్యక్తులకూ నగదు బదిలీలు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ఇది కొనసాగుతూ.. రోజువారీ వ్యవహారాల్లో నగదు అవసరం తగ్గుతుంది. ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన పేమెంట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (పీఐడీఎఫ్‌) ద్వారా 3-6 శ్రేణుల పట్టణాల్లోనూ డిజిటల్‌ చెల్లింపులకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. రాబోయే 3-5 ఏళ్లలో దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ డిజిటల్‌ చెల్లింపులు చెప్పుకోదగ్గ స్థాయిలో వృద్ధి చెందుతాయి. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, ఎన్‌పీసీఐ వినూత్న ఆవిష్కరణల వల్ల దేశంలో మరింత మెరుగైన డిజిటల్‌ చెల్లింపుల పరిష్కారాలు వస్తాయి.

డిజిటల్‌ చెల్లింపులతో నేరాలూ అధికమవుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

చురుకైన సైబర్‌ రక్షణ వ్యవస్థ, సమాచార రక్షణ, రిస్క్‌ నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కార విభాగాల ఏర్పాటు కీలకంగా మారింది. 'లాటరీ తగిలింది, బహుమతి వచ్చింది' అని నమ్మబలకగానే, మోసగాళ్లకు అడిగినంత సొమ్మును కొంతమంది పంపిస్తున్నారు. ఇలాంటి మోసాలపై పరిశ్రమ వర్గాలతో కలిసి అవగాహనా కార్యక్రమాలు చేపట్టాం. యూపీఐని సురక్షితంగా వాడేలా బ్యాంకులు, సంస్థలు తమ వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నాయి. ఎన్‌పీసీఐ కూడా వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు 'యూపీఐ హెల్ప్‌' పేరుతో ఫిర్యాదుల విభాగాన్ని ప్రారంభించింది. మానవ ప్రమేయం తక్కువగా ఉండేలా, స్వల్ప వ్యవధిలోనే సమస్యను పరిష్కరించేలా చూస్తున్నాం.

గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ చెల్లింపులు ఎలా ఉంటున్నాయి?

కరోనా మహమ్మారి తర్వాత స్థానిక చిరు వ్యాపారులూ.. ఫోన్లలో ఆర్డర్లు తీసుకుని, ఇంటివద్దకే సరకులు అందిస్తున్నారు. చెల్లింపులను యూపీఐ ద్వారా స్వీకరిస్తున్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి మార్కెట్లలోనూ రూపే, రూపే కాంటాక్ట్‌లెస్‌ లావాదేవీలూ పెరిగాయి. వ్యాపారులూ నగదు రహిత లావాదేవీలకే మొగ్గు చూపిస్తున్నారు. చెల్లింపుల్లో స్మార్ట్‌ పరికరాల వినియోగమూ వినియోగదారులను ఆకర్షిస్తోంది.

ఇదీ చదవండి : తీవ్ర తుపానుగా యాస్- అమిత్​షా సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.