లాక్డౌన్ కాలంలో స్మార్ట్ఫోన్ల ద్వారా గేమింగ్, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ వినియోగం భారీగా పెరిగినట్లు ఎంఐసీఏ అనే సంస్థ చేసిన సర్వేలో తేలింది. అహ్మదాబాద్ కేంద్రంగా ఉన్న కమ్యూనికేషన్ క్రాప్ట్స్ అనే అంకుర సంస్థతో కలిసి ఈ సర్వే నిర్వహించింది ఎంఐసీఏ.
సర్వే ముఖ్యాంశాలు..
- 2020 మార్చిలో 63 బిలియన్ నిమిషాల గేమింగ్ కంటెంట్ వినియోగం జరిగింది. 2019 మార్చిలో ఈ మొత్తం 42 బిలియన్ నిమిషాలుగా ఉంది.
- కరోనా ముందుతో పోలిస్తే.. స్మార్ట్ఫోన్ల సగటు వినియోగం 3 గంటల 22 నిమిషాల నుంచి 3 గంటల 54 నిమిషాలకు పెరిగింది.
- 2023 నాటికి దేశంలో స్మార్ట్‌ఫోన్ యూజర్లు 92.5 కోట్లకు పెరగొచ్చు.
- 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి మధ్య ఓటీటీల్లో ఎక్కువగా కంటెంట్ వినియోగించిన వారిలో పురుషులే అత్యధికం. 15 నుంచి 24 ఏళ్ల వయసు వారే ఓటీటీ సేవలను అధికంగా వినియోగించారు.
- లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా పోర్న్ కంటెంట్ వినియోగం 33 శాతం పెరిగింది. ఇదే సమయంలో ప్రపంచ సగటు 10.5 శాతంగా ఉంది.
- పోర్న్ కంటెంట్ వినియోగంలోనూ పురుషులే అత్యధికం. మహిళల సంఖ్య కూడా లాక్డౌన్ సమయంలో భారీగా పెరిగింది.
- 2020 మార్చి తొలి 10 రోజుల్లో లూడో గేమ్ యూజర్‌బేస్ 37 లక్షలు పెరిగి.. 95 లక్షలకు చేరింది.
- యూట్యూబ్ తర్వాత ఎక్కువ మంది ఎంఎక్స్ ప్లేయర్లో కంటెంట్ అధికంగా వినియోగించారు. ఆ తర్వాతి స్థానాల్లో హాట్‌స్టార్, నెట్‌ప్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో టీవీల వంటివి ఉన్నాయి.
10 కోట్లకు హాట్‌స్టార్ పెయిడ్ సబ్స్క్రైబర్లు
ప్రముఖ వీడియో ఆన్ డిమాండ్ స్ట్రీమింగ్ సేవల సంస్థ డిస్నీప్లస్ పెయిడ్ సబ్స్క్రైబర్లు (ప్రపంచవ్యాప్తంగా) 10 కోట్లకు పెరిగారు. ఈ విషయాన్ని డిస్నీ వెల్లడించింది.
ప్రస్తుతం 59 దేశాల్లో డిస్నీ ప్లస్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
డిస్నీ యూజర్ బేస్ పెరిగినా.. 200 మిలియన్ల పెయిడ్ సబ్స్క్రైబర్లతో నెట్‌ఫ్లిక్స్ అగ్రస్థానంలో నిలిచింది.
ఇదీ చదవండి:యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో దీపిక