ఎఫ్‌ఎస్‌ఎన్ ఈ-కామర్స్ వెంచర్స్ లిమిటెడ్ నేతృత్వంలోని బ్యూటీ ఉత్పత్తుల అంకుర సంస్థ నైకా ఐపీఓ(Nykaa ipo date) సబ్‌స్క్రిప్షన్ ఈ నెల 28న(Nykaa ipo date) ప్రారంభం కానుంది. నవంబర్ 1న ముగుస్తుంది. మొత్తం రూ.5,352 కోట్లు సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కొ షేరు ధర రూ.1,085-1,125 గా(Nykaa ipo price) నిర్ణయించింది. తాజా షేర్ల ద్వారా రూ.630 కోట్లు కాగా.. మరో 4,19,72,660 షేర్లు ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనున్నారు.
కంపెనీ విలువను 7.4 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. మాజీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ ఫల్గుని నాయర్ నేతృత్వంలోని ఈ సంస్థ 2012లో ప్రారంభమైంది. ప్రస్తుతం బ్యూటీ ఉత్పత్తులకు ప్రధాన ఆన్‌లైన్ కేంద్రంగా మారింది. కంపెనీకి గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,440 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. పలు ప్రముఖ కంపెనీలకు చెందిన ఉత్పత్తులతో పాటు సొంతంగా బ్రాండ్లను కూడా నైకా విక్రయిస్తోంది. ఈ సంస్థ అమ్మకాల పోర్ట్‌ఫోలియోలో 1,500 వరకు బ్రాండ్‌లున్నాయి.
ఐపీఓకి ముందు నైకా కీలక కొనుగోలు..
త్వరలో ఐపీఓకి రానున్న బ్యూటీ ఉత్పత్తుల ఈ-కామర్స్ సంస్థ నైకా.. ప్రముఖ స్కిన్ కేర్ బ్రాండ్ అయిన 'డాట్ అండ్ కీ'లో(Dot and Key Nykaa) మెజారిటీ వాటాలు సొంతం చేసుకుంది. 'డైరెక్ట్ టు కన్జ్యూమర్' సెగ్మెంట్‌లో నైకా ఓ సంస్థను కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. దీంతో నైకా సంస్థ సొంత ఉత్పత్తుల జాబితాలో మరో బ్రాండ్ చేరనుంది. అయితే, ఈ ఆర్థిక లావాదేవీ విలువను నైకా బయటకు వెల్లడించలేదు. కానీ, 'డాట్ అండ్ కీ'లో(Dot and key) 3,35,000 ఈక్విటీ షేర్లను అంటే 51 శాతం వాటాను రూ.46.9 కోట్లకు కొనుగోలు చేసినట్లు నైకా ఐపీఓ కోసం సెబీకి సమర్పించిన ప్రాథమిక పత్రాల్లో పేర్కొంది. మరో 3,57,143 ఈక్విటీ షేర్లను రూ.50 కోట్లకు సబ్‌స్కైబ్ చేసుకున్నట్లు తెలిపింది. మిగిలిన 49 శాతం వాటాలను తర్వాతి దశలో 2025 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.153 కోట్లకు కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. సంస్థ పనితీరు, అప్పటి విలువను బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.
ఇదీ చూడండి: ఈవీ ఛార్జింగ్ సమస్యకు '15 నిమిషాల' పరిష్కారం!