ETV Bharat / business

జనవరిలో జీవిత బీమాయేతర కంపెనీల జోరు - జీవిత బీమాయేతర కంపెనీల ఆదాయంపై ఐఆర్​డీఏఐ నివేదిక

ఈ ఏడాది జనవరిలో జీవిత బీమాయేతర కంపెనీల స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం రూ.18,488.06 కోట్లుగా నమోదైంది. 2020 ఇదే సమయంతో పోలిస్తే ఈ మొత్తం 6.7 శాతం ఎక్కువని ఐఆర్​డీఏఐ తెలిపింది.

IRDAI on premium income
జీవిత బీమాయేతర కంపెనీల ప్రీమియం ఆదాయం
author img

By

Published : Feb 14, 2021, 3:10 PM IST

జీవిత బీమాయేతర కంపెనీల ప్రీమియం ఆదాయం భారీగా పెరిగినట్లు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్​డీఏఐ) వెల్లడించింది. జనవరిలో ఆయా కంపెనీల స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం 6.7 శాతం పెరిగి రూ.18,488.06 కోట్లుగా నమోదైనట్లు తెలిపింది. గత ఏడాది ఇదే నెలలో ఈ మొత్తం రూ.17,333.70 కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది.

ఇందులో 25 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియం ఆదాయం గత ఏడాది జనవరితో పోలిస్తే.. 2021 మొదటి నెలలో 10.8 శాతం వృద్ధి చెంది.. రూ.14,663.40 కోట్ల నుంచి రూ.16,247.24 కోట్లకు చేరినట్లు వివరించింది. ఐదు ప్రైవేటు బీమా సంస్థల స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం మాత్రం 1.34 శాతం (రూ.1,530.70 కోట్ల నుంచి రూ.1,510.20 కోట్లకు) తగ్గినట్లు తెలిపింది.

క్యుమిలేటివ్‌ ప్రాతిపదిక అన్ని జీవిత బీమాయేతర కంపెనీల స్థూల ప్రీమియం ఆదాయం 2020-21 ఏప్రిల్​-జనవరి మధ్య 2.76 శాతం పెరిగినట్లు ఐఆర్​డీఏఐ తెలిపింది. మొత్తం ఆదాయం అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయంతో పోలిస్తే.. రూ.1,59,275.33 కోట్ల నుంచి రూ.1,63,670.13 కోట్లకు పెరిగిందని వివరించింది.

జనరల్ ఇన్సూరెన్స్​ క్యుమిలేటివ్ ప్రీమియం కూడా 2021 జనవరి వరకు 1.91 శాతం పెరిగి రూ.1,40,999.04 కోట్లకు, ఆరోగ్య బీమా సంస్థల ప్రీమియం 8.04 శాతం వృద్ధితో రూ.12,108.73 కోట్లకు చేరినట్లు వెల్లడించింది.

రెండు ప్రభుత్వ రంగ బీమా సంస్థల ప్రీమియం ఆదాయం 8.77 శాతం పెరిగి రూ.10,562.36 కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది ఐఆర్​డీఏఐ.

ఇదీ చదవండి:'కొవిడ్ కాదు.. ఆ వ్యాధులపైనే బడ్జెట్ దృష్టి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.