ETV Bharat / business

'బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేది లేదు' - బిట్​కాయిన్​పై కేంద్రం ప్రకటన

Bitcoin News India Government : బిట్​కాయిన్​ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదననేదీ తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతా రామన్​ ప్రశ్నోత్తరాల సమయంలో లోక్​సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

Bitcoin
బిట్​ కాయిన్​
author img

By

Published : Nov 29, 2021, 5:17 PM IST

Bitcoin News India Government : బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించేందుకు ఎలాంటి ప్రతిపాదన కేంద్రం వద్ద లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో స్పష్టం చేశారు. ఈ మేరకు పార్లమెంటుకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన ఆర్థిక మంత్రి.. బిట్‌కాయిన్ లావాదేవీల‌కు చెందిన డేటాను ప్రభుత్వం సేక‌రించ‌డంలేద‌న్నారు.

అయితే ఈ శీతాకాల పార్లమెంట్ స‌మావేశాల్లో క్రిప్టో కరెన్సీ బిల్లును (cryptocurrency bill india) ప్రవేశ‌పెట్టాల‌ని కేంద్రం యోచిస్తోంది. బిట్‌కాయిన్ లావాదేవీల (bitcoin news latest) నియంత్రణ కోసం రెగ్యులేట‌రీ వ్యవ‌స్థ తీసుకురావాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆర్​బీఐ (bitcoin rbi news) గుర్తింపు పొందిన అధికారిక డిజిటల్‌ కరెన్సీకి ఈ బిల్లు ద్వారా గుర్తింపునిస్తూ... కొన్ని ప్రైవేటు క్రిప్టో కరెన్సీలపై దేశంలో నిషేధం విధించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

పెట్రోల్‌, డీజిల్‌పై వరుసగా 5, 10 రూపాయలను కేంద్రం తగ్గించిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ గుర్తు చేశారు. ఇదే విధంగా రాష్ట్రాలు కూడా తమ వ్యాట్‌ను తగ్గిస్తే ఇంధన ధరలు దిగివస్తాయని లోక్‌సభలో అన్నారు. అటు ఏప్రిల్ -సెప్టెంబర్‌ త్రైమాసికంలో అన్ని మంత్రిత్వశాఖల పరిధిలో రూ.2.29 లక్షల కోట్ల మూలధన వ్యయం కింద ఖర్చు చేసినట్లు ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు నిర్మల బదులిచ్చారు.

ఇదీ చూడండి:

ఎయిరేషియా ఇండియా- ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విలీనం!

Fuel price reduction: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.