ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ బడ్జెట్ అనంతర సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం (ఫిబ్రవరి 16న) ప్రసంగించనున్నారు. ఇందులో బడ్జెట్ 2021-22 ముఖ్యాంశాలను, ఆర్థిక ఏకీకరణకు ప్రణాళికను వివరించే అవకాశముంది. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా తొలిసారి ఈ సమావేశం వర్చువల్గా జరగనుంది.
కరోనా నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యయాలు ఆదాయాన్ని మించి భారీగా పెరిగాయి. ఫలితంగా ద్రవ్యలోటు జీడీపీలో 9.5 శాతానికి పెరగొచ్చని అంచనాలున్నాయి. 2021-22లో ఇది 6.8 శాతంగా నమోదవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 2026 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ఇది 4.5 శాతానికి దిగొస్తుందని అంచనా వేస్తోంది.
ఇదీ చదవండి:'కొవిడ్ కాదు.. ఆ వ్యాధులపైనే బడ్జెట్ దృష్టి'