ETV Bharat / business

'మునుపెన్నడూ చూడని బడ్జెట్‌ రూపొందిస్తాం' - post pandemic budget

ఇదివరకు ఎన్నడూ చూడని బడ్జెట్​ను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా బడ్జెట్​ను రూపొందిస్తామని తెలిపారు. వైద్య, బయోటెక్నాలజీ, ఫార్మా రంగాల్లో పరిశోధనకు మరిన్ని పెట్టుబడులు అవసరమని అభిప్రాయపడ్డారు.

nirmala sitaram on upcoming budget, central revenue minister
'చరిత్రాత్మక బడ్జెట్​ను ప్రవేశ పెడతాము'
author img

By

Published : Dec 19, 2020, 5:39 AM IST

కరోనా మహమ్మారి ప్రభావంతో దెబ్బ తిన్న దేశ ఆర్థిక వ్యవస్థను వేగంగా ముందుకు నడిపించేందుకు, వృద్ధిని గాడిలో పెట్టేందుకు అనువైన బడ్జెట్‌ రూపొందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. గతంలో ఎన్నడూ చూడని బడ్జెట్‌ను వచ్చే ఆర్థిక సంవత్సరానికి తయారు చేస్తామని ఆమె భరోసా ఇచ్చారు. సీఐఐ (భారతీయ పరిశ్రమల సమాఖ్య) పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌-2020 కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు.

"కొవిడ్‌ వంటి క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్యం, వైద్య పరిశోధన-అభివృద్ధిపై (ఆర్‌అండ్‌డీ) పెట్టుబడులు పెట్టడానికి, టెలిమెడిసిన్‌ను నిర్వహించడానికి ఎక్కువ నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎంతో కీలకం. సరికొత్త జీవన విధానంలో వృత్తి శిక్షణ, నైపుణ్యాభివృద్ధిపై అనేక సవాళ్లను కూడా ఎదుర్కోవల్సి రావచ్చు. అందుకే పరిశ్రమల నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తున్నాను. ఒక మహమ్మారి విజృంభించిన తరవాత ఎప్పుడూ లేనివిధంగా బడ్జెట్‌ను రూపొందిద్దాం"

-నిర్మలా సీతారామన్‌

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద కూడా...

ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించే సత్తా భారత్​కు ఉందని నిర్మల ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్​ కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో అతిశయోక్తిలేదన్నారు. గ్లోబల్ ఎకానమీను గట్టెక్కించడంలో భారత్ ముఖ్యపాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ కోసం ఇతర దేశాలపై భారత్​ ఆధారపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఉపాధి రంగంలో కీలక మార్పులు జరగనున్నాయని... అందుకు తగ్గట్టుగా వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: 'ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సరిపోవు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.