ETV Bharat / business

Net Direct Tax: ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5.70 లక్షల కోట్లు - ప్రత్యక్ష పన్నులపై కేంద్రం

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రత్యక్ష పన్ను (Net Direct Tax) కింద రూ.5.70 లక్షల కోట్లు వసూలయ్యాయని కేంద్రం వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో నమోదైన రూ.4.39 లక్షల కోట్లతో పోలిస్తే ఇందులో 47 శాతం వృద్ధి కనిపించింది.

net direct tax
ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5.70 లక్షల కోట్లు
author img

By

Published : Sep 25, 2021, 6:37 AM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు (ఏప్రిల్‌ 1- సెప్టెంబరు 22) ప్రత్యక్ష పన్ను వసూళ్లు (Net Direct Tax) 74 శాతం పెరిగి రూ.5.70 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ముందస్తు పన్ను, టీడీఎస్‌ (tax deducted at source) చెల్లింపులు పెరగడం ఇందుకు దోహదపడింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లలోకి వ్యక్తిగత ఆదాయ, కార్పొరేట్‌ పన్నులు వస్తాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో పన్ను వసూళ్లు రూ.3.27 లక్షల కోట్లు, 2019-20లో రూ.4.48 లక్షల కోట్లుగా ఉన్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.6.45 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో నమోదైన రూ.4.39 లక్షల కోట్లతో పోలిస్తే ఇందులో 47 శాతం వృద్ధి కనిపించింది.

ముందస్తు పన్ను (advance tax payment) ద్వారా రూ.2.53 లక్షల కోట్లు, మూలం వద్ద పన్ను (టీడీఎస్‌)తో (tax deducted at source) రూ.3.19 లక్షల కోట్లు వసూలయ్యాయి. స్వీయ మదింపు పన్ను కింద రూ.41,739 కోట్లు, సాధారణ మదింపు పన్ను కింద రూ.25,558 కోట్లు, డివిడెండ్‌ పంపిణీ పన్ను కింద రూ.4406 కోట్లు, ఇతర పన్నులతో రూ.1383 కోట్లు ఖజానాకు చేరాయి.

ఇదీ చూడండి : బండి ఏదైనా.. ఇక 'ఫ్లెక్స్​ ఫ్యూయల్​' ఇంజిన్ తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.