ETV Bharat / business

మోల్నుపిరవిర్‌: మూడో దశ పరీక్షలకు అనుమతివ్వండి!

కరోనా చికిత్సలో భాగంగా నాట్కో ఫార్మా తయారుచేసిన మోల్నుపిరవిర్‌' ఔషధం మూడోదశ ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడీఎస్‌సీఓ)కు దరఖాస్తు చేసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ఔషధం తీసుకున్న ఐదురోజుల్లోనే రోగుల్లో మెరుగైన ఫలితాలు కనిపించాయని పేర్కొంది.

molphivarir
మోల్నుపిరావిర్‌
author img

By

Published : Apr 27, 2021, 6:15 AM IST

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ.. చికిత్సలో వినియోగించే ఔషధాలపై ఫార్మా సంస్థలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా నాట్కో ఫార్మా తయారుచేసిన 'మోల్నుపిరవిర్‌' ఔషధం మూడోదశ ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడీఎస్‌సీఓ)కు దరఖాస్తు చేసుకున్నట్లు నాట్కో ఫార్మా సంస్థ వెల్లడించింది.

'కరోనా రోగులపై మోల్నుపిరవిర్‌ ఔషధం మూడోదశ ప్రయోగాలు జరిపేందుకు సీడీఎస్‌సీఓకు దరఖాస్తు చేసుకున్నాం' అని నాట్కో ఫార్మా సంస్థ వెల్లడించింది. ఇప్పటికే ఈ ఔషధం ఇన్‌ఫ్లుయెంజాకు వ్యతిరేకంగా పోరాడడంతో పాటు కరోనా వైరస్‌కు కారణమయ్యే సార్స్‌-కోవ్‌-2 ప్రతిరూపాన్ని నిరోధించడంలో శక్తిమంతంగా పనిచేసినట్లు ప్రీ-క్లినికల్‌ ప్రయోగ ఫలితాల్లో తేలినట్లు నాట్కో ఫార్మా పేర్కొంది. క్యాప్సూల్‌ రూపంలో ఉండే మోల్నుపిరవిర్‌ ఔషధం తీసుకున్న ఐదురోజుల్లోనే రోగుల్లో మెరుగైన ఫలితాలు కనిపించాయని.. తద్వారా స్వల్ప వ్యవధిలోనే రోగులు కోలుకోకుంటారనే విషయాన్ని ఇది సూచిస్తుందని నాట్కో సంస్థ గుర్తుచేసింది. ఈ ఔషధాన్ని మాత్రల రూపంలో(నోటిద్వారా) తీసుకునే సౌలభ్యం ఉండడం మరో ప్రయోజనకర విషయమని పేర్కొంది.

ఇప్పటివరకు ఉన్న ప్రయోగ ఫలితాల సమాచారంపై పూర్తి విశ్వాసం ఉన్నందున తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులకు అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీఓ అనుమతి ఇస్తుందని భావిస్తున్నామని నాట్కో ఫార్మా అభిప్రాయపడింది. ఒకవేళ అనుమతి లభిస్తే.. ఈ ఔషధాన్ని ఈ నెలలోనే అందుబాటులోకి తీసుకువస్తామని నాట్కో ఆశాభావం వ్యక్తం చేసింది.

విరాఫిన్‌కు అనుమతి

మరోవైపు.. కరోనా చికిత్సలో వాడేందుకు జైడస్‌ క్యాడిల్‌ తయారుచేసిన 'విరాఫిన్‌'కు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఒకే మోతాదులో వాడే విరాఫిన్‌ యాంటీవైరల్‌ ఇంజక్షన్‌ కొవిడ్‌ చికిత్సలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని జైడస్‌ సంస్థ పేర్కొంది. మధ్యస్థాయి కరోనా లక్షణాలతో బాధపడేవారికి చికిత్సలో భాగంగా దీన్ని అందిస్తారు. ఇప్పటికే తీవ్ర కరోనాతో బాధపడేవారికి రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్‌ను అందిస్తున్నారు. ఇప్పుడు మాత్ర రూపంలో ఉండే ఔషధ అనుమతి కోసం నాట్కో ఫార్మా ప్రయత్నాలు చేస్తోంది.

ఇదీ చదవండి : భయం వద్దు: 90శాతం రోగులకు ఇంటివద్దే నయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.