మోటోరోలా కంపెనీ కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. మోటో జీ9 పవర్ పేరుతో డిసెంబర్ 8న ఈ మొబైల్‌ను విడుదల చేయనుంది. ఈ మేరకు కంపెనీ ట్వీట్ చేసింది. 'ఓ కొత్త తరహా పవర్ ఫోన్ మీ చేతుల్లోకి రానుంది. దాని పేరు మోటో జీ9 పవర్. డిసెంబర్ 8, మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ వేదికగా మొబైల్ లాంచ్ అవుతోంది. అప్పటి వరకు వేచి చూడండి' అని మోటోరోలా కంపెనీ ట్వీట్ చేసింది.
-
These top tech reviewers can't wait to unbox the new #motog9power! It's going to be here soon with a 6000 mAH battery, 64 MP triple camera system, Stock Android™ experience, & more. Launching at a never seen before price on 8th Dec, 12 PM on @Flipkart. https://t.co/hab1HEtv0f pic.twitter.com/GmnF9Cbez9
— Motorola India (@motorolaindia) December 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">These top tech reviewers can't wait to unbox the new #motog9power! It's going to be here soon with a 6000 mAH battery, 64 MP triple camera system, Stock Android™ experience, & more. Launching at a never seen before price on 8th Dec, 12 PM on @Flipkart. https://t.co/hab1HEtv0f pic.twitter.com/GmnF9Cbez9
— Motorola India (@motorolaindia) December 5, 2020These top tech reviewers can't wait to unbox the new #motog9power! It's going to be here soon with a 6000 mAH battery, 64 MP triple camera system, Stock Android™ experience, & more. Launching at a never seen before price on 8th Dec, 12 PM on @Flipkart. https://t.co/hab1HEtv0f pic.twitter.com/GmnF9Cbez9
— Motorola India (@motorolaindia) December 5, 2020
ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొబైల్ ప్రారంభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్‌ను ఇప్పటికే యూరప్‌లో లాంచ్ చేశారు. ఫోన్ ధర రూ. 17,400 (199 యూరోలు) అని తెలుస్తోంది. మిగతా కంపెనీలకు పోటీగా కొత్త తరహా ఫీచర్స్‌తో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. యువతే లక్ష్యంగా టర్బో పవర్‌తో ఆకర్షణీయంగా మొబైల్‌ను రూపొందించినట్లు సమాచారం.
మోటో జీ9 పవర్ ఫీచర్స్:
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.8 అంగుళాల హెచ్‌డీ + డిస్‌ప్లే ఇస్తున్నారు. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో మొత్తం మూడు కెమెరాలు ఉన్నాయి. 64 ఎంపీ ప్రైమరీ సెన్సర్‌తో పాటు 2 ఎంపీ మాక్రో కెమెరా ఉంది. ముందు భాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 2 ఎంపీ డెప్త్ సెన్సర్ అమర్చారు. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 4జీబీ ర్యామ్‌తో పాటు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో లభిస్తోంది. ఎస్‌డీ కార్డుతో ఈ స్టోరేజీని 512జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఎలక్ట్రిక్ వయిలెట్, మెటాలిక్ సేజ్ రంగుల్లో లభిస్తుంది.