ETV Bharat / business

పొదుపు చేయడం ఓ కళ.. దాన్ని సొంతం చేసుకోండిలా! - పొదుపు ఆవశ్యకత

డబ్బు సంపాదించడం తెలియడం వేరు.. దాన్ని ఆచితూచి ఖర్చుచేయడం వేరు. చాలా తక్కువమందికి తెలిసిన ఈ కళను మీరూ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? పొదుపుపై కొంత అవగాహన పెంచుకుని చూడండి. అంతర్జాతీయ పొదుపు దినోత్సవం సందర్భంగా ఆ వివరాలేంటో చూద్దామా...

రండి... పొదుపు చేద్దాం!
author img

By

Published : Oct 30, 2019, 3:22 PM IST

ఈ రోజుల్లో డబ్బులు దాచుకోవడానికి, లావాదేవీలు చేయడానికి కొన్ని బ్యాంకులు మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని ఖాతాలు అందుబాటులోకి తెచ్చాయి. ఆ ఖాతాల ద్వారా షాపింగ్‌, పొదుపు వంటివాటి పరంగా ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. ముఖ్యంగా పలు బ్యాంకులు విమెన్‌ సేవింగ్స్‌ అకౌంట్లను అందిస్తున్నాయి. ఏదైనా నచ్చిన వస్తువు, దుస్తులు కనబడగానే కొనాలనుకుంటారు మహిళలు. అలాంటి వారికి ఈ ఖాతాలు ఎంతోగానో ఉపయోగపడతాయి. వీళ్లకోసం ప్రత్యేకంగా ఐ విష్‌ అకౌంటునీ అందిస్తోందో బ్యాంకు. అంటే మనం అనుకున్న వస్తువు తాలూకు ధరను నమోదు చేసి ఎన్నాళ్లలో కొనుక్కోవచ్చో వివరిస్తే... నెలకు కొంత మొత్తం మన జీతం నుంచి బ్యాంకు తీసుకుంటుంది. గడువుతేదీ ముగిశాక ఆ డబ్బు కొంత రివార్డులతో కలిపి మన చేతికి వస్తుంది. ఇలాంటి సదుపాయాలే మరికొన్ని బ్యాంకులూ అందిస్తున్నాయి. పెద్దవాళ్లకే కాదు.. పిల్లల అవసరాలను దృష్టిలో పెట్టుకునీ ఈ పొదుపుఖాతాలు అందుబాటులోకి తెస్తున్నాయి బ్యాంకులు. ఆ వివరాలు తెలుసుకుని నచ్చినదాంట్లో పొదుపు దిశగా అడుగులు వేసేందుకు ప్రయత్నించండి.

మీ వంతుగా ఎంత...

నెల తిరిగేసరికి జీతం తీసుకోవడం, ఖర్చుచేయడం మనలో చాలామంది చేసేదే. మరి అత్యవసర సమయంలో డబ్బు అవసరం అయితే... ఆ సమస్యకు పరిష్కారం మీ చేతుల్లోనే ఉందంటారు నిపుణులు. ఆదాయాన్ని అనుసరించి ముందు పదో, పదిహేను శాతమో పొదుపు చేశాకే ఖర్చుల గురించి ఆలోచించండి. మిగిలిన డబ్బుకు తగినట్లుగానే మీ అవసరాల గురించి ఆలోచించండి. దీర్ఘకాలం పొదుపు చేయగలిగితే ఎక్కువ మొత్తం కనిపిస్తుంది. ఇది సాధ్యం కావాలంటే వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం చాలా అవసరం. మీరేం చేయక్కర్లేదు. కొన్నాళ్లపాటు ప్రతినెలా దేనికి ఎంత ఖర్చుచేస్తున్నారనేది ఓ చోట రాయండి. నెల తిరిగేసరికి వృథా అనుకున్న ఖర్చుల్ని కొట్టేసి మరోసారి అవి చేయకుండా జాగ్రత్తపడండి. ఈ చిన్న ప్రక్రియ తెలియకుండానే ఎంతో డబ్బును మిగులుస్తుంది. ప్రయత్నించి చూడండి.

పిల్లలకు చెప్పడం కాదు...

సాధారణంగా పిల్లలు ఏదయినా అడిగితే వెంటనే కొనివ్వం. ఆలోచిస్తాం. ఎందుకు అని ప్రశ్నిస్తాం. ఉపయోగకరం అనుకుంటేనే కొనిస్తామని చెబుతాం. అదే సూత్రం మనమెందుకు పాటించకూడదు. ఏదయినా కొనాలని అనుకున్నప్పుడు వెంటనే షాపింగ్‌కి బయలుదేరకండి. ముందు అది అవసరమా కాదా అనేది ఆలోచించండి. ఆ తరువాతా దాని ఉపయోగాన్ని అంచనా వేయండి. తాత్కాలిక అవసరం అనుకుంటే ఎవరినైనా అడిగి తీసుకోవడమే ఉత్తమం. దుస్తులు, చెప్పులు, అలంకరణ సామగ్రి, బ్యాగులు ఇలా ఏవి కొనాలన్నా తొందరపడకండి. మీదగ్గరున్న వస్తువుల్ని గమనించుకోండి. ఆ తరువాతే నిర్ణయం తీసుకోండి. వీలైనంతవరకూ విలాసాలకు పోకుండా ఉండటమే మేలు. ముఖ్యంగా స్నేహితులతో కలిసి వెళ్లి ఏవో ఒకటి కొనేయడం, గొప్పలకు పోవడం వద్దే వద్ధు.

చిల్లర ఏం చేస్తున్నారు...

ఒకప్పుడు మన అమ్మమ్మలు పోపులడబ్బాలో డబ్బు దాచేవారు. అది ఎక్కువమొత్తం కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుందని నమ్మేవారు. అదే సూత్రాన్ని మనమూ అనుసరించొచ్ఛు మీకు అందుబాటులో చిన్న హుండీ పెట్టుకోండి. నిత్యావసరాలు, ఇతర వస్తువులు కొనగా వచ్చిన చిల్లరను ఎక్కడపడితే అక్కడ పెట్టేయకుండా అందులో వేయండి. ఆ హుండీ పూర్తిగా నిండితే మీరెంత పొదుపు చేశారనేది మీకే తెలుస్తుంది. చిన్న ఖర్చుకైనా ఆ డబ్బు ఉపయోగపడుతుంది.

ఇదీ చూడండి: ఉద్దీపనపై ఆశలు- 40,100 మార్క్​ దాటి సెన్సెక్స్ పరుగులు

Intro:भोपाल- राजधानी भोपाल के शाहपूरा थाना स्थित एक रेस्टॉरेंट में स्टाफ से मारपीट करने का एक मामला सामने आया है। बताया जा रहा है कि, नामी बिल्डर अपने साथियों के साथ इस रेस्टॉरेंट में खाना खाने गया था। लेकिन खाने का ऑर्डर में लेट लतीफी को लेकर बिल्डर का रेस्टॉरेंट संचालक और स्टाफ से विवाद हो गया। देखते ही देखते विवाद इतना बढ़ गया कि, बिल्डर और उसके साथी हाथापाई पर उतर आए। बिल्डर और उसके साथियों ने रेस्टॉरेंट संचालक और स्टाफ से जमकर मारपीट भी की। और रेस्टॉरेंट में जमकर तोड़फोड़ भी की। ये पूरा नज़ारा रेस्टॉरेंट में लगे सीसीटीवी कैमरे में कैद हो गया है।

Body:

घटना के बाद रेस्टॉरेंट संचालक ने इसकी शिकायत शाहपुरा थाना पुलिस से भी की। लेकिन बिल्डर के रसूख के चलते थाना पुलिस ने रेस्टॉरेंट संचालक को बाहर का रास्ता दिखा दिया। और इस मामले में कोई कार्रवाई नहीं की गई। रेस्टॉरेंट की महिला कर्मचारियों ने बिल्डर और उसके साथियो पर गलत तरीके से छूने के भी आरोप लगाएं है। उम्मीद है कि, सीसीटीवी फूटेज के आधार पर और पुलिस अधिकारियों के संज्ञान में मामला आने के बाद अब पुलिस बिल्डर के खिलाफ कोई कार्रवाई करेगी।Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.