ఆత్మనిర్భర్‌భారత్ ద్వారా దేశీయ పరిశ్రమలు బలాన్ని పుంజుకోవడంతో పాటు.. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడి ప్రపంచానికి మన వనరులను అందజేస్తాయని ప్రధాని పేర్కొనడంపై పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
"వ్యాక్సిన్ తయారీలో భారత్ ముందు వరుసలో ఉంది. మన కంపెనీలు అద్భుతమైన ప్రగతిని కనబరుస్తున్నాయి. ఈ స్వాతంత్య్ర దినోత్సవాన అంటువ్యాధుల బారి నుంచి మనం బయటపడడానికి కావల్సినదంతా చేస్తామని ప్రతినబూనాలి."
- ప్రతాప్ సి రెడ్డి, ఛైర్మన్, అపోలో హాస్పిటల్స్ గ్రూప్
"ప్రతీ స్వాతంత్య్ర దినోత్సవం.. మనం లక్షల మంది అర్పించిన ప్రాణ త్యాగాలకు ఒక ఘన నివాళి. వారి వల్లే మనకు ఈ స్వేచ్ఛ లభించింది. ఇక ఇప్పటి నుంచి ఆత్మనిర్భర్ భారత్ అనేది మన స్వేచ్ఛా పతాకం ఎంత ఎత్తున, ఎంత బలంగా రెపరెపలాడుతుందన్నది నిర్దేశిస్తుంది."
- గౌతమ్ అదానీ, ఛైర్మన్, అదానీ గ్రూప్
"ఆత్మనిర్భర్‌భారత్‌పై ప్రధాని స్పష్టంగా ఉన్నారు. స్వయం సమృద్ధి సాధించిన భారత్ ప్రపంచానికి సైతం వనరులను అందించగలిగే స్థాయికి చేరాలి. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య గుర్తింపు కార్డును ఇవ్వాలన్న లక్ష్యంపై ఫిక్కీ హర్షం వ్యక్తం చేస్తోంది."
- సంగీతా రెడ్డి, ప్రెసిడెంట్, ఫిక్కీ
"దేశంలో ఆరోగ్యసంరక్షణను అందించడానికి ఒక డిజిటల్ హెల్త్ కార్డు ఉండడం చాలా కీలకం. ఆరోగ్యరంగంలో పరిశోధన, వినూత్నతపై ప్రధాని దృష్టి సారించడం, జాతీయ అజెండాలో ప్రాధాన్యతను సంతరించుకోవడం అతిపెద్ద గుర్తింపుగా చూడాలి."
- కిరణ్ మజుందార్ షా, సీఎండీ, బయోకాన్
73 ఏళ్లకు స్పష్టత..
'ముడి పదార్థాలను ఎగుమతి చేసి.. తయారైన వస్తువులను దిగుమతి చేయడం భారత్ నిలివేయాలి.'.. 1947లో భారత లక్ష్యం ఇది. అయితే అది అంతగా విజయవంతం కాలేదు. ఆ తప్పును 1991కి ముందు నాటి శకంపై తోయలేం కూడా. ఎందుకంటే 30 ఏళ్ల సరళీకరణ వల్ల కూడా తయారీ రంగం పోటీపరంగా ఎదగలేకపోయింది. కొద్ది నెలల కిందట ఆత్మనిర్భర్ భారత్‌ను ప్రధాని మోదీ ప్రకటించినపుడు దాని నిర్వచనంపై కొంత ఆందోళన ఉండేది. అయితే 74వ స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని చేసిన ప్రసంగంలో స్పష్టత లభించింది. తిరిగి గతంలోకి వెళ్లడం కాదేకాదని ఆయన అన్నారు. ప్రపంచానికి భారత్‌లో తయారైన వస్తువులను అందించడమే దాని లక్ష్యమని తేల్చి చెప్పారు. అందుకు మన కంపెనీలు తూర్పు ఆసియా దేశాలు, చైనా చేసిన విధంగా వ్యూహాలను అమలుపరచి అంతర్జాతీయ పోటీనివ్వగలిగే స్థాయికి చేరాలి. ఆత్మనిర్భర్ భారత్ అంటే కేవలం దేశంలో తయారైన వస్తువులను వినియోగించడమే కాకుండా.. మన సామర్థ్యాలను, నైపుణ్యాలను, వినూత్నతను పెంచుకోవడం అన్న ప్రధాని మాటలను నిజం చేయాలి.
-ధీరజ్ నయ్యర్, చీఫ్ ఎకనమిస్ట్, వేదాంతా రిసోర్సెస్
ఇదీ చూడండి: కరోనా సంక్షోభంలోనూ రాణిస్తున్న ఎడ్‌టెక్ కంపెనీలు