ETV Bharat / business

వచ్చే వారం నుంచే మోడెర్నా టీకా పంపిణీ!

దేశంలో మోడెర్నా టీకా(Moderna Vaccine) జులై 15 నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీకాల దిగుమతి ప్రక్రియను ఫార్మా సంస్థ సిప్లా ప్రారంభించింది. ఈ వారం చివరి నాటికి ఇవి భారత్​కు రానుండగా.. ఆస్పత్రులకు కేటాయించేందుకు మరోవారం పట్టనుందని సమాచారం.

moderna vaccine india availability
మెడెర్నా టీకా
author img

By

Published : Jul 5, 2021, 5:20 PM IST

దేశంలో మరో కొవిడ్ టీకా(Corona vaccine) పంపిణీకి కేంద్రం సిద్ధమవుతోంది. ఇప్పటికే కొవిషీల్డ్(Covishield), కొవాగ్జిన్(Covaxin), స్పుత్నిక్‌-వీ టీకాలను పంపిణీ చేస్తుండగా.. జులై 15 నుంచి మోడెర్నా టీకా(Moderna Vaccine) సైతం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

మోడెర్నా టీకా దిగుమతుల కోసం ప్రముఖ దేశీయ ఫార్మా సంస్థ సిప్లాకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ గతవారం అనుమతులు మంజూరు చేసింది. అయితే ఇందుకు కొన్ని షరతులు విధించింది. టీకా పంపిణీ చేపట్టిన తర్వాత తొలి 100 లబ్ధిదారులకు సంబంధించి 7 రోజుల ఆరోగ్య పరిస్థితిని సంస్థ సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో.. మోడెర్నా టీకాల దిగుమతి ప్రక్రియను సిప్లా ప్రారంభించింది. ఈ వారం చివరినాటికి వీటిని దిగుమతి చేసుకోనుంది. ఆ తర్వాత ఆసుపత్రులకు కేటాయించేందుకు మరో వారం పట్టనుందని తెలుస్తోంది. జులై 15 నుంచి ఆయా ఆసుపత్రుల్లో ఈ టీకా పంపిణీ మొదలవనున్నట్లు సమాచారం.

ధర ఎక్కువే!

మోడెర్నా టీకాను mRNA టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. క్లినికల్‌ ప్రయోగాల్లో 90శాతానికి పైనే సమర్థత కనబర్చిన ఈ టీకాకు... అగ్రరాజ్యం అమెరికాతో పాటు పలు సంపన్న దేశాలు అత్యవసర అనుమతులు మంజూరు చేశాయి. భారత్‌లో ఈ టీకా ధరను అటు మోడెర్నా గానీ, ఇటు సిప్లా గానీ ఇంతవరకూ ప్రకటించలేదు. అయితే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్‌ ధర ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర టీకాల కంటే ఎక్కువే ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే టీకా ధరను సిప్లా ప్రకటించే అవకాశముంది.

ఇదీ చదవండి: విద్యార్థికి అండగా ప్రభుత్వం- ప్రత్యేక విమానంలో తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.