ETV Bharat / business

పెట్రో ధరలు పెరిగింది 60 రోజులే: కేంద్రం

రోజురోజుకూ పెట్రోల్​ ధరలు రికార్డ్​ స్థాయికి పెరుగుతున్నాయి. అయితే ధరల పెంపునకు కారణం ప్రభుత్వం కాదని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. రాజ్యసభలో విపక్షాలు అడిగిన పలు ప్రశ్నలకు సమధానమిచ్చారు.

Dharmendra Pradhan
పెట్రో ధరలు పెరిగింది 60 రోజులే: కేంద్రం
author img

By

Published : Feb 10, 2021, 2:30 PM IST

పెట్రో ధరలు రికార్డ్​ స్థాయికి చేరాయంటూ కేంద్రాన్ని విమర్శించడం తగదని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలు విధిస్తాయే తప్ప ధరలను నిర్ణయించవని ప్రధాన్​ స్పష్టం చేశారు. పెట్రోల్​, డీజిల్​ ధరల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని.. చమురు సంస్థలే ధరలను నిర్ణయిస్తాయని తెలిపారు. పెట్రో ధరల పెంపునకు కేంద్రం కారణమని ప్రచారం చేయడం తగదన్నారు ధర్మేంద్ర.

"గత 300 రోజుల్లో 60 రోజుల పాటు చమురు ధరలు పెరిగాయి. 7 రోజుల పాటు పెట్రోల్, 21 రోజులు డీజిల్​ ధరలు తగ్గించాం. దాదాపు 250 రోజులు ధరలు యథాతథ స్థితిలోనే ఉన్నాయి. కనుక ధరలు ఆకాశాన్నంటాయి, చుక్కల్ని తాకాయి అని ప్రచారం చేయడం తగదు."

- ధర్మేంద్ర ప్రధాన్, పెట్రోలియం శాఖ మంత్రి

పెట్రో ధరల పెంపుపై రాజ్యసభలో అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఎక్సైజ్​ సుంకాన్ని మాత్రమే కేంద్రం పెంచిందని, రాష్ట్రాలు వ్యాట్​ ట్యాక్స్​ను పెంచాయన్నారు.

మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పన్ను విధింపుల్లో చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఎందుకంటే ప్రజా సంక్షేమం, అభివృద్ధి కూడా ముఖ్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధిక ఆదాయం వచ్చే మార్గాల్లో ఇది ఒకటి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.