ETV Bharat / business

'బీమా అవసరాన్ని కరోనా గుర్తు చేసింది'

'కరోనా తర్వాత జీవిత, ఆరోగ్య బీమా పాలసీల అవసరాన్ని చాలామంది గుర్తించారు. దీనికి అనుగుణంగా బీమా సంస్థలూ.. వినూత్న ఆవిష్కరణలతో ముందుకు వస్తున్నాయి. పాలసీదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్‌ రూపంలో పాలసీలను ఇవ్వడం ద్వారా వారికి మరింత చేరువవుతున్నాయి' అని అంటున్నారు మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ ప్రశాంత్‌ త్రిపాఠి. ఆయనతో 'ఈటీవీ భారత్​' ఇంటర్వ్యూ విశేషాలు..

author img

By

Published : Jan 24, 2021, 6:31 AM IST

maxlife insurance
'బీమా అవసరాన్ని కరోనా గుర్తు చేసింది'

జీవిత బీమా, ఆరోగ్య బీమాల గురించి 'ఈటీవీ భారత్​'తో మ్యాక్స్​లైఫ్​ ఇన్సూరెన్స్​ మేనేజింగ్​ డైరెక్టర్​, సీఈఓ ప్రశాంత్ త్రిపాఠి పంచుకున్న విశేషాలు ఇవే..

కొవిడ్‌-19 మహమ్మారి జీవిత బీమా రంగంపై ఎలాంటి ప్రభావం చూపించింది ?

కొవిడ్‌-19 మనందరికీ 'సంసిద్ధత' అవసరాన్ని తెలియజేసిందని చెప్పుకోవచ్చు. లాక్‌డౌన్‌ అమలు తొలినాళ్లలో బీమా పరిశ్రమ ఇబ్బంది పడింది. తొలి ప్రీమియం వసూళ్లలో క్షీణత కనిపించింది. ఆ తర్వాత జీవిత బీమా సంస్థలు డిజిటల్‌ వైపు దృష్టి సారించాయి. బీమా పాలసీల్లో డిజిటల్‌ విక్రయాలను పెంచాల్సిన అవసరాన్ని కరోనా స్పష్టంగా తెలియజేసింది. ఈ 'కొత్త సాధారణ' జీవితంలో సాంకేతికతలను అభివృద్ధి చేసుకోవడంపైన బీమా సంస్థలు దృష్టి నిలపాల్సిన పరిస్థితి. మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఈ విషయంలో ముందు నుంచీ జాగ్రత్తలు తీసుకుంది. మా పాలసీదారులకు ఇబ్బంది కలగకుండా డిజిటల్‌ ఛానెళ్లను పటిష్ఠం చేశాం. పాలసీల విక్రయాలు, పాలసీ జారీ, క్లెయిం, సేవలన్నీ డిజిటల్‌ రూపంలోనే అందిస్తున్నాం. బీమా సలహాదార్లకూ పాలసీలు విక్రయించేందుకు డిజిటల్‌ సాంకేతికతను అందించాం.

జీవిత, ఆరోగ్య బీమా పాలసీదారులు తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకునే దిశగా బీమా సంస్థలు ప్రోత్సహించాలని ఐఆర్‌డీఏ సూచించింది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?

ఆర్‌డీఏఐ జారీ చేసిన మార్గదర్శకాలు బీమా సంస్థలకూ, పాలసీదారులకూ మేలు చేసేవే. బీమా సంస్థలు పాలసీదారులలో ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అవగాహన కల్పించాలి. పాలసీదారులు నిరంతరం బీమా సంస్థలతో అనుసంధానం అయ్యేలా ఇది వీలు కల్పిస్తుంది. ఈ ప్రక్రియలో సేకరించిన సమాచారం ఆధారంగా వారికి మరింత మేలైన ఉత్పత్తులను అందించేందుకు ఉపయోగపడుతుంది. పాలసీదారులు ఆరోగ్యకరమైన జీవనాన్ని గడిపినప్పుడు బీమా సంస్థలకు తక్కువ క్లెయింలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఆ ప్రయోజనాల్ని అంతిమంగా పాలసీదారులతో పంచుకుంటాయి. ఫలితంగా వారికి ప్రీమియంలో రాయితీ లభిస్తుంది. ఈ దిశగా బీమా సంస్థలు మరింత కృషి చేస్తున్నాయి. ఇప్పటికే పలు బీమా సంస్థలు దీనికోసం ప్రత్యేక యాప్‌లనూ తీసుకొచ్చాయి. మేమూ ఇలాంటి యాప్‌ను అందుబాటులోకి తెచ్చాం.

దీర్ఘకాలంలో బీమా పరిశ్రమ పనితీరును ఎలా విశ్లేషిస్తారు?

చ్చే దశాబ్ద కాలంలో బీమా పరిశ్రమ 12-15 శాతం వరకూ వృద్ధి చెందుతుందని అంచనా. ప్రస్తుతం కొవిడ్‌-19 మహమ్మారి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది. ఫలితంగా రక్షణ, రాబడి హామీతో ఉన్న పథకాలకు ఆదరణ పెరిగింది. ఈ ధోరణి భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశముంది. బీమా రంగం నిర్మాణాత్మక వృద్ధిలో మధ్య తరగతి, చిన్న కుటుంబాలు, యువ జనాభా తోడ్పడతాయి. కరోనా తర్వాత బీమా సంస్థలు వినూత్న ఆవిష్కరణల అవసరాన్ని గుర్తించాయి. తమ ఉద్యోగులు, సలహాదార్లలో నైపుణ్యాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యేక అవసరాలకు ప్రత్యేక పాలసీలు తీసుకొచ్చేందుకు ఐఆర్‌డీఏఐ కృషి చేస్తోంది. ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహిస్తూ.. పాలసీదారులకు విలువ ఆధారిత పాలసీలను అందించేందుకు బీమా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇవన్నీ దీర్ఘకాలంలో బీమా పరిశ్రమకు మేలు చేసేవే. రాబోయే కాలంలో యాన్యుటీ పాలసీల విభాగం వృద్ధి చెందే అవకాశం ఉంది. వ్యక్తుల జీవిత కాలం పెరగడంతో వారు.. పదవీ విరమణ తర్వాత అవసరాలకు ఈ తరహా పథకాలపైనే దృష్టి సారిస్తారు.

పాలసీ జారీ, ప్రీమియం చెల్లింపులు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. సైబర్‌ నేరాలు ఇటీవల బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల సమాచారం అంతా భద్రంగానే ఉంటోందా?

సాంకేతికత, నిర్వహణ, ఆర్థిక భద్రత విషయంలో ఎదురయ్యే నష్టాలను ఎదుర్కొనేందుకు పరిశ్రమ సిద్ధంగానే ఉంటుంది. సమాచారాన్ని సేకరించడం, వాటిని విశ్లేషించడం, దాన్ని గుర్తించడం కోసం ఆధునిక సాంకేతికతతో కూడిన యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నాం. మ్యాక్స్‌ లైఫ్‌లో పూర్తి పారదర్శకతతో లావాదేవీలు జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయి.

రాబోయే బడ్జెట్‌- 2021పై మీ అభిప్రాయాలేమిటి?

త ఏడాది బడ్జెట్‌లో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో పన్ను రేట్లను తగ్గించారు. కొత్త పన్నుల విధానాన్ని ప్రవేశ పెట్టడంతో సెక్షన్‌ 80సీ కింద జీవిత బీమా ప్రీమియం సహా అనేక మినహాయింపులను పన్ను చెల్లించేవారు వదులుకోవాల్సి వస్తోంది. వ్యక్తులకు ఆర్థిక రక్షణ కల్పించడంలో జీవిత బీమా పాలసీల ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని, కొత్త పన్నుల విధానంలో బీమా ప్రీమియానికి మినహాయింపును కల్పించాల్సిన అవసరం ఉంది. రాబోయే బడ్జెట్‌లో టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలకు సంబంధించి జీఎస్‌టీని 5శాతానికి తీసుకురావాలి. దీనివల్ల ఈ బీమా పాలసీల రేట్లు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. తక్కువ ప్రీమియంతో అధిక రక్షణ లభించే ఈ పాలసీలను తీసుకునేందుకు పాలసీదారులను ప్రోత్సహించేందుకు ఈ చర్య ఉపయోగపడుతుంది.

వచ్చే ఏడాదిలో మ్యాక్స్‌ లైఫ్‌ పనితీరు ఎలా ఉండబోతోంది?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మ్యాక్స్‌ లైఫ్‌ పనితీరు సంతృప్తికరంగానే ఉంది. మేము 10-15 శాతం వృద్ధి రేటును సాధించాం. రక్షణ పాలసీల్లో వృద్ధి సాధిస్తూనే... ఇతర పాలసీలకూ ప్రాధాన్యం ఇస్తాం. 2021లో వినియోగదారులను పెంచుకునే లక్ష్యంతో పనిచేస్తున్నాం.

ఇదీ చూడండి:బడ్జెట్​కు ముందు కేంద్ర ఆర్థికశాఖ 'హల్వా' వేడుక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.