ETV Bharat / business

ఆ వాహనాల ఉత్పత్తిని పూర్తిగా నిలిపేయనున్న మారుతీ! - మారుతీ సుజుకీ డీజిల్‌ కార్లను ఎందుకు తగ్గించింది?

కాలుష్య ఉద్గారాల తగ్గింపు చర్యల్లో తన వంతు బాధ్యతగా డీజిల్‌ వాహనాలను ఉత్పత్తిని చేయట్లేదని దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ(maruti suzuki cars) తెలిపింది. అధిక మైలేజీ ఇచ్చే.. పెట్రోల్‌ కార్లపైనే దృష్టి సారించనున్నట్లు వివరించింది.

maruti suzuki
మారుతీ సుజుకీ
author img

By

Published : Nov 22, 2021, 7:07 AM IST

మళ్లీ డీజిల్‌ వాహనాలను ఉత్పత్తి చేసే ఉద్దేశం లేదని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) స్పష్టం చేసింది. 2023లో అమల్లోకి రానున్న కాలుష్య ఉద్గారాల నూతన నిబంధనల వల్ల డీజిల్‌ వాహనాల(maruti suzuki diesel cars) ధరలు పెరిగి, వాటి వినియోగం మరింత తగ్గుతుందని పేర్కొంది. అందువల్ల అధిక మైలేజీ ఇచ్చే పెట్రోల్‌ ఇంజిన్‌తో నడిచే కార్ల ఉత్పత్తిపైనే కంపెనీ దృషి సారిస్తోందని ఎంఎస్‌ఐ చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ సి.వి.రామన్‌ తెలిపారు. ఇప్పటికే సెలెరియోకు(maruti suzuki celerio 2021) అమర్చిన కే10-సి ఇంజిన్‌ ఈ తరహాలో రూపొందించిందేనని, లీటరుకు 26.68 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని వివరించారు. కాలుష్య ఉద్గారాల తగ్గింపు కోసం తన వంతు బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

భవిష్యత్తులో హైబ్రిడ్‌(maruti suzuki hybrid vehicles), విద్యుత్తు వాహనాలను సంస్థ ఆవిష్కరిస్తుందని తెలిపారు. ఇప్పుడు 10 శాతం ఇథనాల్‌ కలిపిన ఇంధనానికి అనువైన ఇంజిన్లున్నాయని, 2023 నాటికి 20 శాతం ఇథనాల్‌ కలుస్తుంది కనుక, అందుకు తగిన ఇంజిన్‌ రూపొందిస్తామన్నారు. మొత్తం ప్రయాణికుల వాహనాల్లో(maruti suzuki passenger vehicles) డీజిల్‌ విభాగం వాటా 17 శాతమన్నది పరిశ్రమ అంచనా. 2013-14లో ఇది 60 శాతం కావడం గమనార్హం.

2020 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన బీఎస్‌ 6(maruti suzuki bs6 cars) ఉద్గార ప్రమాణాల వల్ల, దేశీయంగా వాహన తయారీ సంస్థలు, డీజిల్‌ వాహనాలను తగ్గించుకోగా, ఎంఎస్‌ఐ(msil maruti suzuki) పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం బీఎస్‌ 6 ప్రమాణాల 1 లీటర్‌, 1.2 లీటర్‌, 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్లతోనే ఎంఎస్‌ఐ వాహనాలు రూపొందుతున్నాయి. 7 మోడళ్లను సీఎన్‌జీ ఇంజిన్లతోనూ సంస్థ ఉత్పత్తి చేస్తుండగా, మరిన్ని తయారు చేయనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.