2020 జనవరి నుంచి తమ వాహనాల ధరలు పెంచుతామని దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా ప్రకటించింది. ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
గతేడాది ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల వాహనాల వ్యయం భారీగా పెరిగిపోయిందని... ఇది కంపెనీపై ప్రతికూల ప్రభావం చూపిందని మారుతీ సుజుకి ఇండియా ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
"2020 జనవరి నుంచి వివిధ మోడళ్ల ధరల్లో పెరుగుదల ఉంటుంది. కార్ల ఉత్పత్తికి అవుతున్న అదనపు వ్యయాన్ని కొంత వినియోగదారులకు బదిలీ చేయాల్సిన అవసరం ఉంది."- మారుతీ సుజుకి ఇండియా
2020 జనవరి నుంచి పెరగనున్న కార్ల ధరలు... మోడళ్లను బట్టి వేర్వేరుగా ఉంటాయని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఎంట్రీ లెవల్ స్మాల్ కారు ఆల్టో నుంచి ప్రీమియం మల్టీ పర్పస్ వెహికల్ ఎక్స్ఎల్ 6 వరకు.. రూ.2.89 లక్షల నుంచి రూ.11.47 లక్షల వరకు (దిల్లీ ఎక్స్ షోరూమ్) సంస్థ విక్రయిస్తోంది.
ఇదీ చూడండి: 'వారిది మోసపూరిత రాజకీయం.. మాది ప్రజాసేవ'