ETV Bharat / business

మారుతీ కార్లలో లోపాలు- 1.8 లక్షల యూనిట్లు రీకాల్​! - మారుతీ రీకాల్​ చేస్తున్న కార్​ మోడళ్లు

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ 1.8 లక్షల యూనిట్లను రీకాల్ (Maruti recall cars) చేయనుంది. సియాజ్​, ఎర్టీగా, విటారా బ్రెజ్జా సహా వివిధ మోడళ్లు ఇందులో (Maruti recalling models) ఉన్నాయి. రికాల్​కు సంబంధించి మారుతీ సుజుకీ వెల్లడించిన పూర్తి వివరాలు ఇవే..

Maruti recall cars
మారుతీ భారీ రీకాల్​
author img

By

Published : Sep 3, 2021, 4:58 PM IST

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. భారీ రీకాల్ (Maruti recall cars) ప్రకటించింది. సియాజ్​, ఎర్టీగా, విటారా బ్రెజ్జా, ఎక్స్​ఎల్6​ సహా పలు ఇతర మోడళ్లలోని ఇంజిన్​లో లోపాలను (Maruti recalling models) గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఆయా మోడళ్లలోని పెట్రోల్ వేరియంట్లలో మాత్రమే లోపాలు ఉన్నట్లు స్పష్టం చేసింది మారుతీ సుజుకీ.

2018 మే 4 నుంచి 2020 అక్టోబర్​ 27 మధ్య ఉత్పత్తి అయిన మోడళ్లలో మాత్రమే ఈ లోపలు ఉన్నట్లు పేర్కొంది కంపెనీ. లోపాలను సరిచేసేందుకు 1,81,754 యూనిట్లను రీకాల్ చేయనున్నట్లు తెలిపింది.

వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని భారత్​తో పాటు ప్రపంచవ్యాప్తంగా లోపాలున్నట్లు అనుమానమున్న కార్లన్నింటిని వెనక్కి రప్పించనున్నట్లు వివరించింది మారుతీ సుజుకీ. రీకాల్ చేసిన కార్లలో నిజంగానే లోపాలు ఉంటే.. మోటార్​ జనరేటర్​ యూనిట్​ను ఉచితంగా రీప్లేస్​ చేయనున్నట్లు తెలిపింది. ఇది ఇంజిన్​కు అదనపు శక్తిని ఇస్తుంది.

ఆయా కార్ల యజమానాలను కంపెనీనే నేరుగా సంప్రదిస్తుందని.. మారుతీ సుజుకీ స్పష్టం చేసింది. కార్లలో లోపాలున్న విడిభాగాల మార్పిడి నవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. అప్పటి వరకు రీకాల్ విభాగంలో ఉన్న కార్లను నీళ్లలో నడిపించడం, ఎలక్ట్రానిక్​, ఎలక్ట్రిక్​ భాగాలను నీటితో కడగటం వంటివి చేయొద్దని వినియోగదారులకు సూచించింది.

ఇదీ చదవండి: వాట్సాప్​కు రూ.2 వేల కోట్ల జరిమానా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.