అంతర్జాతీయ కారణాలు, వృద్ధి మందగమనం, తయారీ రంగంలో క్షీణతతో మంగళవారం నష్టాల్లో ఊగిసలాడిన స్టాక్‌మార్కెట్లు నేడూ ఒత్తిడికి లోనవుతున్నాయి. ఆరంభంలో ఫ్లాట్‌గా ట్రేడయిన సూచీలు ప్రస్తుతం స్వల్ప లాభాల్లోకి వెళ్లాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 53 పాయింట్లు పెరిగి 36, 615 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 13 పాయింట్ల వృద్ధితో 10, 810 వద్ద కొనసాగుతోంది.
లాభాల్లో ఉన్న షేర్లు...
ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్టెల్, వేదాంత, భారతీ ఇన్ఫ్రాటెల్, ఇన్ఫోసిస్‌లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
నష్టాల్లో ఉన్న షేర్లు...
టాటా మోటార్స్, సన్ ఫార్మా, జీ ఎంటర్టైన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్ కంపెనీ నష్టాలు నమోదు చేశాయి.
కోలుకున్న రూపాయి
నిన్న భారీగా పతనమైన రూపాయి.. ప్రస్తుతం స్వల్పంగా కోలుకుంది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 11 పైసలు పెరిగి.. 72.28 వద్ద ఉంది.