అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఫార్మా తప్ప.. లోహ, వాహన, ఇన్ఫ్రా, ఐటీ లాంటి కీలక రంగాలు రాణిస్తున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 232 పాయింట్లు వృద్ధి చెంది 40 వేల 814 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 12, 033 వద్ద ట్రేడవుతోంది.
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాదిలోనూ వడ్డీరేట్లు మార్చేది లేదని ప్రకటించడం, అమెరికా- చైనాల తొలి విడత వాణిజ్య చర్చలు ఫలవంతం కావచ్చనే అంచనాలతో మార్కెట్లు లాభాలబాట పట్టాయి. బ్రిటన్‌లో ఎన్నికలు సజావుగా జరగడమూ ఇందుకు దోహదపడింది.
లాభనష్టాల్లో
టాటా మోటార్స్, ఎస్ బ్యాంకు, టాటా స్టీల్, వేదాంత, హిందాల్కో రాణిస్తున్నాయి.
భారతీ ఎయిర్టెల్, సిప్లా, బీపీసీఎల్, బ్రిటానియా, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా నేలచూపులు చూస్తున్నాయి.
ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్లు.. నిక్కీ, హాంగ్‌సెంగ్, కోస్పీ, షాంగై కాంపోజిట్ లాభాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి విలువ
రూపాయి విలువ 28 పైసలు తగ్గి, ఒక డాలరుకు రూ.70.55గా ఉంది.
ఇదీ చూడండి: 'మతపరమైన మైనారిటీల హక్కులను పరిరక్షించండి'