ETV Bharat / business

మార్కెట్ల కొత్త రికార్డు- 45,600పైకి సెన్సెక్స్ - స్టాక్ మార్కెట్​ వార్తలు తెలుగు

స్టాక్​ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 181 పాయింట్ల లాభంతో 45,600 మార్క్ దాటింది. నిఫ్టీ 37 పాయింట్లు పెరిగి 13,400కు చేరువైంది. 30 షేర్ల ఇండెక్స్​లో అల్ట్రాటెక్ సిమెంట్ భారీగా లాభపడింది. సన్​ఫార్మా అత్యధికంగా నష్టాపోయింది.

Stock markets touches new record level
రికార్డు స్థాయికి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Dec 8, 2020, 3:48 PM IST

కరోనా వ్యాక్సిన్​ అత్యవసర వినియోగం వార్తలు, దేశ వృద్ధి రేటుపై సానుకూల అంచనాలు స్టాక్ మార్కెట్లను వరుసగా ఆరో రోజూ పరుగులు పెట్టించాయి. మంగళవారం సెషన్​లో బీఎస్​ఈ-సెన్సెక్స్ 181 పాయింట్లు బలపడి జీవనకాల గరిష్ఠమైన 45,608 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 37 పాయింట్లు పెరిగి సరికొత్త జీవనకాల రికార్డు స్థాయి అయిన 13,393 వద్దకు చేరింది.

వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో జియో 5జీ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. దీనికి తోడు టీసీఎస్​ సహా ఇతర హెవీ వెయిట్, ఐటీ షేర్లు సానుకూలంగా స్పందించడం మార్కెట్ల లాభాలకు కారణంగా తెలుస్తోంది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 45,742 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 45,335 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 13,435 పాయింట్ల గరిష్ఠ స్థాయి (సరికొత్త రికార్డు స్థాయి), 13,311 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్​సీఎల్​టెక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలను గడించాయి.

సన్​ఫార్మా, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎన్​టీపీసీ, టెక్ మహీంద్రా, ఓఎన్​జీసీ షేర్లు నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, టోక్యో, సియోల్, హాంకాంగ్ సూచీలు నష్టాలను నమోదు చేశాయి.

ఇదీ చూడండి:2021 ద్వితీయార్ధంలో జియో 5జీ సేవలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.