ETV Bharat / business

బుల్ జోరు- జీవితకాల గరిష్ఠాలకు సూచీలు - సరికొత్త గరిష్టాలకు స్టాక్ మార్కెట్లు

బుల్​ దూకుడుతో స్టాక్ మార్కెట్లు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. సెన్సెక్స్ సోమవారం 347 పాయింట్లు బలపడి చరిత్రలో తొలిసారి 45,420పైన స్థిరపడింది. నిఫ్టీ 97 పాయింట్లు ఎగిసి నూతన జీవనకాల గరిష్ఠమైన 13,350పైకి చేరింది. 30 షేర్ల ఇండెక్స్​లో ఓఎన్​జీసీ భారీగా లాభ పడింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎక్కువగా నష్టపోయింది.

stocks markets touch new record level
సరికొత్త రికార్డు స్థాయికి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Dec 7, 2020, 3:46 PM IST

స్టాక్ మార్కెట్లు సోమవారం సరికొత్త రికార్డు స్థాయి వద్ద మగిశాయి. బుల్ జోరుతో బీఎస్​ఈ-సెన్సెక్స్ 347 పాయింట్లు బలపడి జీవనకాల గరిష్ఠమైన 45,427 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 97 పాయింట్లు పెరిగి సరికొత్త జీవనకాల రికార్డు స్థాయి అయిన 13,356 వద్దకు చేరింది.

అమెరికా ఉద్దీపన ప్యాకేజీ ఆశలు సహా.. కొవిడ్ వ్యాక్సిన్​పై పెరుగుతున్న సానుకూలతలు మదుపరుల సెంటిమెంట్​ను బలపరిచాయి. ఫలితంగా నమోదైన కొనుగోళ్ల మద్దతు మార్కెట్ల రికార్డు స్థాయి లాభాలకు కారణంగా తెలుస్తోంది. దీనితోపాటు ఆర్​బీఐ, నీతి ఆయోగ్​లు, ఆర్థి మంత్రిత్వ శాఖలు దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ ఊహించినదానికన్నా వేగంగా జరుగుతున్నట్లు ప్రకటించడం లాభాలకు కలిసొచ్చినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 45,459 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 45,024 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 13,367 పాయింట్ల గరిష్ఠ స్థాయి(సరికొత్త రికార్డు స్థాయి), 13,241 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఓఎన్​జీసీ, భారతీ ఎయిర్​టెల్, హెచ్​యూఎల్​, ఐటీసీ, హెచ్​డీఎఫ్​సీ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే, టాటా స్టీల్, బజాజ్ ఫినాన్స్, మారుతీ షేర్లు నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, టోక్యో, హాంకాంగ్ సూచీలు నష్టాలను నమోదు చేశాయి. సియోల్ మాత్రమే లాభాలతో ముగిసింది.

ఇదీ చూడండి:మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.