వినియోగదార్ల ఇంటికే మద్యం సరఫరా చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని తయారీదార్లతో పాటు హోటళ్లు-రెస్టారెంట్లు, బార్లు, ఆన్‌లైన్ ఫుడ్ సంస్థలు కోరుతున్నాయి. తద్వారా భౌతిక దూరం పాటిస్తూనే, కొవిడ్-19 సంక్షోభ ప్రభావం నుంచి తమ రంగాలు కోలుకుంటాయని పేర్కొంటున్నాయి.
"ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, గ్రోఫర్స్ వంటి ఇ-కామర్స్ సంస్థలకు, జొమాటో, స్విగ్గీ వంటి ఆహార సరఫరా సంస్థలకు ప్రత్యేక లైసెన్స్‌లు జారీ చేసి, మద్యం ఆర్డర్లు తీసుకునే అవకాశం కల్పించాలి. వివిధ రాష్ట్రాల్లో లైసెన్స్‌లు కలిగి ఉన్న రిటైలర్లు, హోల్‌సేలర్ల నుంచి వారు మద్యం తీసుకుని, వినియోగదార్లకు సరఫరా చేసేలా చూడాల’ని ఆల్ ఇండియా బ్రూవర్స్ అసోసియేషన్ (ఏఐబీఏ) ప్రభుత్వానికి నివేదించింది. తమ వద్ద నిల్వ ఉన్న సుమారు రూ.3,000 కోట్ల విలువైన మద్యాన్ని ‘వినియోగదార్లకు ఇళ్ల వద్దకే సరఫరా చేసుకునేలా’ విక్రయ అనుమతి ఇవ్వాలని రెస్టారెంట్లు, హోటళ్లు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాయి. భారీమొత్తంలో నిల్వ ఉన్న మద్యాన్ని విక్రయించుకుంటాం."
- అనురాగ్ కత్రియార్, నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏ) అధ్యక్షుడు
ఇదీ చూడండి: మద్యం షాపుల ముందు నారీమణుల బారులు!