ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా తమ సంస్థ నుంచి వస్తున్న కార్ల ధరలను పెంచింది. ఈ ఏడాది మహీంద్రా కార్ల ధరలు పెరగడం ఇది మూడోసారి. కార్ల తయారీలో వినియోగించే విలువైన లోహాల ధరలు పెరగడంతో పాటు ఇతర నిర్వహణ వ్యయాలు పెరిగాయని.. ఆ ప్రభావం నుంచి కొంత వరకైనా బయటపడేందుకు వినియోగదారులకు దాన్ని బదిలీ చేయనున్నామని సంస్థ పేర్కొంది.
అత్యధికంగా ఇటీవల మార్కెట్లోకి వచ్చిన 'థార్' ధర వేరియంట్‌ను బట్టి రూ.42,300-1,02,000లు పెరిగింది. ఇతర మోడళ్లపై ధరల పెరుగుదల ఇలా ఉంది..
మోడల్ ధర పెరిగిన మొత్తం(రూ.లలో)
- కేయూవీ 100 ఎన్‌ఎక్స్‌టీ రూ.3,016-రూ.3,344
- బొలెరో రూ.21,000-రూ.22,600
- ఎక్స్‌యూవీ 300 రూ.5,000-రూ.24,000
- ఎక్స్‌యూవీ 500 రూ.2,912-రూ.3,188
- మరాజో రూ.26,000-రూ.30,000
- స్కార్పియో రూ.30,000-రూ.40,000
- అల్టురాస్‌జీ4 రూ.3,094
ఇదీ చదవండి : ల్యాప్‌టాప్ కొంటున్నారా.. అయితే వీటిపై ఓ లుక్కేయండి