వంటగ్యాస్ ధరలు వచ్చే నెల తగ్గే అవకాశముందని పెట్రోలియం, సహజవాయువు వ్యవహారాల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఛత్తీస్‌గఢ్ పర్యటనలో ఉన్న ఆయన ఎల్పీజీ ధరల పెరుగుదలపై ఈ విధంగా స్పందించారు.
"ధరలు నిరంతరంగా పెరుగుతున్నాయటం వాస్తవం కాదు. ఈ నెలలో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగటం వల్లనే వంటగ్యాస్ ధరలు పెరిగాయి. శీతకాలంలో గ్యాస్ వాడకం పెరుగుతుంది. వేసవిలో తగ్గుతుంది. వచ్చే నెలలో ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. "
-ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రి
ఒక్కో సిలిండర్‌పై రూ.144.5(దిల్లీలో) పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ ఇంధన సరఫరా సంస్థ ఇండియన్ ఆయిల్ ఈనెల 12న ప్రకటించింది. అయితే... సామాన్యులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తిరిగి ఇచ్చే రాయితీ సొమ్మును రెట్టింపు చేసింది. సబ్సిడీ రూ.153.86 నుంచి రూ.291.48కి పెంచింది.