ETV Bharat / business

సామాన్యులకు షాక్- మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర - పెరిగిన సిలిండర్ ధర

దేశీయంగా వంట గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. 14.2 కిలోల సిలిండర్​ ధరను రూ.50 పెంచినట్లు ఇండియన్ అయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. 15 రోజుల్లో వంట గ్యాస్ ధర పెరగటం ఇది రెండో సారి.

COOKING GAS PRICE HIKED
మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర
author img

By

Published : Dec 15, 2020, 12:05 PM IST

Updated : Dec 15, 2020, 1:14 PM IST

పెట్రోల్‌, నిత్యవసరాల ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులకు.. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు మరోసారి షాకిచ్చాయి.

రాయితీ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచుతూ.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. సిలిండర్​పై రూ.50 పెంచుతున్నట్లు ప్రకటించింది. 15రోజుల వ్యవధిలో సిలిండర్‌ ధర పెరగడం ఇది రెండోసారి. డిసెంబర్‌ 2న కూడా సిలిండర్‌ ధర రూ.50 పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.

ఈ పెంపుతో దేశ రాజధానిలో ప్రస్తుతం రూ.644గా ఉన్న 14.2 కిలోల గ్యాస్‌ ధర రూ.694కు పెరిగింది. ఇక 5 కేజీల సిలిండర్‌పై రూ.18, 19 కేజీల సిలిండర్‌ ధర రూ.36.50 పెంచినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు వెల్లడించాయి. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నాయి.

ఇదీ చూడండి:'కరోనా 'భూతద్దం' లా పనిచేసింది'

Last Updated : Dec 15, 2020, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.