ETV Bharat / business

గుడ్​ న్యూస్​.. డిసెంబరులో తగ్గనున్న గ్యాస్ ధర! - ఆయిల్ సంస్థలు ఎల్​పీజీ ధరలు

కరోనా కొత్త వేరియంట్ ప్రభావంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో చమురు సంస్థలు వచ్చే నెల నుంచి గ్యాస్ సిలిండర్ ధరలను(LPG cylinder price:) భారీగా తగ్గించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సార్వత్రిక ఖాతా సంఖ్య(యూఏఎన్‌)ను ఆధార్‌తో అనుసంధానించడానికి ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది.

LPG cylinder price
గ్యాస్ ధరలు
author img

By

Published : Nov 28, 2021, 5:43 PM IST

వినియోగదారులకు శుభవార్త. డిసెంబరు 1 నుంచి ఎల్​పీజీ సిలిండర్ ధరలు తగ్గే అవకాశముంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడమే ఇందుకు కారణం. ఎల్​పీజీ సిలిండర్​ ధరలను ప్రభుత్వ చమురు సంస్థలు ప్రతి నెల సమీక్షించి కొత్త ధరలు నిర్ణయిస్తాయి. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ ప్రభావంతో... క్రూడ్ ఆయిల్ ధరలు దిగివచ్చాయి. గతేడాది ఏప్రిల్​ స్థాయికి చేరుకున్నాయి.

శుక్రవారం బ్రెంట్​ కూడాయిల్ ధర బ్యారెల్​ 10 డాలర్లకు చేరింది. ఈ ప్రభావంతో ఆయిల్ సంస్థలు ఎల్​పీజీ సిలిండర్ల ధరను డిసెంబరు నుంచి తగ్గించనున్నాయని సమాచారం.

డిసెంబర్ 1 నుంచి మరికొన్ని మార్పులు రానున్నాయి. అవి...

నవంబరు 30 డెడ్​లైన్​..

ఈ నెలాఖరు కల్లా మీరు మీ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సార్వత్రిక ఖాతా సంఖ్య(యూఏఎన్‌)ను ఆధార్‌తో అనుసంధానించాల్సి (link aadhaar to pf number) ఉంటుంది. లేదంటే.. 'ఎల‌క్ట్రానిక్ చ‌లాన్ క‌మ్ రిట‌ర్న్ (ఈసీఆర్‌)' భర్తీ కాదు. అంటే మీ పీఎఫ్ ఖాతాల్లో వచ్చే నెల నుంచి కంపెనీ వాటా జమ కాదు.

వెంటనే ఉద్యోగుల యూఏఎన్‌ను ఆధార్‌తో అనుసంధానించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) యాజమాన్యాలకు సైతం తెలియజేసింది. ఇంత‌కు ముందు యూఏఎన్‌-ఆధార్ అనుసంధానానికి 31 ఆగస్టు 2021 తుది గడువుగా విధించారు. అనంతరం దాన్ని 2021 నవంబరు 30 వ‌ర‌కు పొడిగించారు.

ఎస్​బీఐ కెడిట్​ కార్డులపై...

ఎస్​బీఐ క్రెడిట్​ కార్డులను ఉపయోగించి షాపింగ్ చేసేవారికి చేదు వార్త. ఇప్పటివరకు వడ్డీ రేట్లను మాత్రమే వసూలు చేస్తుండగా.. డిసెంబరు 1 నుంచి కొనుగోళ్లపై ప్రాసెసింగ్ ఛార్జీలను ఎస్​బీఐ విధించనుంది.

ఇదీ చూడండి: పెన్షనర్లకు హై అలర్ట్.. రెండు రోజులే గడువు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.