ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో(హెచ్1) దేశీయంగా తయారయ్యే విదేశీ లిక్కర్ అమ్మకాలు భారీగా 29 శాతం పడిపోయాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బీవరేజ్ కంపెనీస్ (సీఐఏబీసీ) విడుదల చేసిన డేటా ద్వారా ఈ విషయం తెలిసింది.
ఆంధ్రప్రదేశ్, బంగాల్, పుదుచ్చేరి, రాజస్థాన్‌లో డిమాండ్ తగ్గడం వల్ల ఈ స్థాయిలో విక్రయాలపై ప్రభావం పడిందని పేర్కొంది సీఐఏబీసీ. ఇప్పటికీ లిక్కర్‌పై విధిస్తున్న 50 శాతం కరోనా సుంకం వల్ల.. ఆయా రాష్ట్రాల్లో విక్రయాలు దాదాపు 50 శాతం పడిపోయాయని వివరించింది.
దేశవ్యాప్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో లిక్కర్ విక్రయాలు పెరిగినప్పటికీ.. మొదటి త్రైమాసికంలో లాక్డౌన్ వల్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఫలితంగా మొదటి అర్ధభాగం విక్రయాలు తగ్గాయి.
2020-21 రెండో త్రైమాసికంలో విక్రయాలు తగ్గిన రాష్ట్రాలు..
- ఆంధ్రప్రదేశ్ - 51 శాతం
- ఛత్తీస్‌గఢ్ - 40 శాతం
- బంగాల్ - 22 శాతం
- రాజస్థాన్ - 20 శాతం
- జమ్ము కశ్మీర్(కేంద్ర పాలిత ప్రాంతం) - 39 శాతం
ఇదీ చూడండి:రాష్ట్రపతికి 15వ ఆర్థిక సంఘం తుది నివేదిక