దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం పలు ఆంక్షలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో పాలసీదారులకు ఊరట కలిగించింది భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ). కరోనా వ్యాప్తి కారణంగా సకాలంలో బీమా ప్రీమియం చెల్లించలేని పాలసీదారులకు గడువు పెంచింది. 2020, ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది.
దేశంలో ఇప్పటి వరకు 341 మందికి వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఇప్పటికే అనేక రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశంలోని ప్రజలంతా ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించారు.